అధికారంలోకి వస్తే ప్రాణాలర్పిస్తానని మొక్కు.. ఆలయంలో నిప్పంటించుకుని...

Published : Jul 10, 2021, 09:14 AM IST
అధికారంలోకి వస్తే ప్రాణాలర్పిస్తానని మొక్కు.. ఆలయంలో నిప్పంటించుకుని...

సారాంశం

శుక్రవారం మణమంగలం పుదు కాళియమ్మన్ ఆలయంలోకి వెళ్లాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఆలయ సిబ్బంది మంటలు ఆర్పుందుకు యత్నించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

తమిళనాడు : డీఎంకే అధికారంలోకి వస్తే ప్రాణాలు అర్పిస్తానని మొక్కుక్కున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లా లాలాపేటకు చెందిన ఉలగనాథన్ (60) రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి. 

శుక్రవారం మణమంగలం పుదు కాళియమ్మన్ ఆలయంలోకి వెళ్లాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఆలయ సిబ్బంది మంటలు ఆర్పుందుకు యత్నించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. వాంగల్ పోలీసులు అతడు రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. 

అందులో ‘శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం కావాలని, ఎమ్మెల్యేగా సెంథిల్ బాలాజీ విజయం సాధించాలని మొక్కుకున్నాను. విళుపురం జిల్లా గ్రామ నిర్వాహక అధికారిగా పనిచేస్తున్న నా కుమారుడిని మంత్రి సెంథిల్ బాలాజీ పరిధిలో నియమించాలి. ఇదే నా చివరి ఆశ’ అని లేఖలో రాశారు. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం