ఏమిటిది: అధికారులపై కనిక కపూర్ కుటుంబ సభ్యుల ఫైర్

Published : Mar 23, 2020, 09:45 AM ISTUpdated : Mar 23, 2020, 10:01 AM IST
ఏమిటిది: అధికారులపై కనిక కపూర్ కుటుంబ సభ్యుల ఫైర్

సారాంశం

బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కుటుంబ సభ్యులొకరు వైద్యాధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కనిక కపూర్ వైద్య పరీక్షల నివేదికలో తప్పులను ఎత్తి చూపుతూ ఫైర్ అయ్యారు. జెండర్ స్థానంలో మేల్ అని రాశారని చెప్పారు. 

లక్నో: బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కుటుంబ సభ్యులు వైద్యాధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. వైద్యులు ఇచ్చిన నివేదికలోని తప్పులను ఎత్తి చూపుతూ వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడారు. 

కనిక కపూర్ మెడికల్ రిపోర్టులో ఆమె వయస్సు 28 అని రాశారని, నిజానికి ఆమె వయస్సు 14 ఏళ్లేనని అన్నారు. నివేదికలో కనిక కపూర్ ను పురుషుడిగా పేర్కొన్నట్లు ఆరోపించారు. కరోనా కపూర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

Also Read: నేనేమీ బాత్రూమ్ లో దాక్కోలేదు

కనిక కపూర్ మెడికల్ రిపోర్టు మీడియా ముందుకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అన్నారు. కరోనా బారిన పడినవారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని చెబుతూ కనిక కపూర్ వివరాలు ఎందుకు బయటకు చెప్పారని అడిగారు. 

కనిక కపూర్ మెడికల్ రిపోర్టును బయటపెట్టడం వల్ల తాము అవమానాలకు గురవుతున్నామని అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కరోనా వైరస్ బారిన పడిన కనిక కపూర్ కు టచ్ లోకి వచ్చిన 53 మందిలో 11 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలినవారి నివేదికలు రావాల్సి ఉంది.

Also Read: సింగర్ కనికా కపూర్ కరోనా నిప్పు: దుష్యంత్ ఎవరెవరిని కలిశారంటే.....

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌