భారతదేశంలో రెండో కరోనా వైరస్ మరణం నమోదైంది. ఢిల్లీలో చికిత్స పొందుతూ 68 ఏళ్ల మహిళ మృత్యువాత పడింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కుమారుడి నుంచి కోవిడ్ 19 ఆమెకు సోకింది.
న్యూఢిల్లీ: భారత్ లో కరోనావైరస్ కారణంగా రెండో మరణం సంభవించింది. కోవిడ్ 19 బారిన పడిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. గత నెలలో స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలకు వెళ్లి వచ్చిన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా గురువారం తొలి మరణం సంభవించింది. కర్ణాటకలో 76 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29వ తేదీన వచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. భారతదేశంలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: వరంగల్ లో మరో ఇద్దరు కరోనావైరస్ అనుమానితులు
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 82కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారంనాడు ఢిల్లీ, కర్ణాటక, మహరాష్ట్రల్లో కొత్తగా 13 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలో తాజాగా ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
కర్ణాటకలో పాఠశాలలను, షాపింగ్ మాళ్లను మూసేశారు. పలు రాష్ట్రాల్లో కూడా వాటిని మూసేారు. ఐపిఎల్ లీగ్ ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండు వన్డేలు కూడా రద్దయ్యాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు
కరోనా వైరస్ భూతాన్ని కలిసికట్టుగా ఎదుర్కుందామని ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. హైదరాబాదులో కరోనావైరస్ బారిన పడిన యువకుడు కోలుకున్నాడు. వైరస్ తీవ్రంగా ఏడు దేశాల నుంచి వచ్చేవారిని ప్రయాణికులను నేరుగా వికారాబాదులోని హరిత హోటల్ కు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.