కరోనా బాధితురాలిని కూడా వదలని కామాంధులు

By Siva KodatiFirst Published May 7, 2020, 8:09 PM IST
Highlights

దేశంలో కొందరు కామాంధులు కరోనా వైరస్‌ ‌వచ్చిన వారిని కూడా వదలడం లేదు. తాజాగా యూపీలో ఓ కోవిడ్ 19 బాధితురాలిని ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది లైంగిక వేధించారు. 

దేశంలో కొందరు కామాంధులు కరోనా వైరస్‌ ‌వచ్చిన వారిని కూడా వదలడం లేదు. తాజాగా యూపీలో ఓ కోవిడ్ 19 బాధితురాలిని ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది లైంగిక వేధించారు. 

Also Read:గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్ ప్రోగ్రామే' కారణం: కాంగ్రెస్ ఆరోపణ

వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు కరోనా సోకడంతో స్థానిక శ్రద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో మహిళను సదరు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు, స్టోర్ ఉద్యోగి వారిని లైంగిక వేధింపులకు గురిచేశారు.

దీనిపై ఆసుపత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు లవ్‌కుశ్, ప్రవీణ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్న వీరిని విధుల నుంచి తొలగించినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

Also Read:భారత్ లో కరోనా కరాళ నృత్యం: 50వేలు దాటిన కేసులు, 10 రోజుల్లోనే రెట్టింపు!

కాగా భారతదేశంలో గురువారం నాటికి 52,952 మందికి కోవిడ్ సోకగా, వీరిలో 1,783 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267 మంది కోలుకుని డిశ్చార్జ్  అవ్వగా మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు. 
 

 

click me!