
ఢిల్లీ : సాధారణంగా డిసెంబర్, జనవరిలో Poulty, egg కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరగడంతో priceలు కూడా పెరుగుతాయి. కానీ జనవరి 3 తరువాత దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు రాత్రిపూట Curfew విధించాయి. దీంతో గుడ్లు, చికెన్ సరఫరాపై ప్రభావం పడింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ముర్గా మండిలో చికెన్ ధరలు 25 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో గుడ్ల ధరలపైనా ప్రభావం పడింది.
దుకాణాల్లో రూ. 200 వరకు విక్రయించే గుడ్ల ధర రూ.150 కి తగ్గింది. wholesale marketలోనూ గుడ్ల ధరలు పడిపోయాయి. Boiled eggs ఇప్పుడు చిల్లరగా రూ.7కు విక్రయిస్తున్నారు. ఇంతకుముందు ఎనిమిది నుంచి పది రూపాయల వరకు విక్రయించే వారు. ప్రస్తుతం దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గుడ్లు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. ఇక్కడ 100 కోడిగుడ్ల ధర రూ.450 కి కంటే తక్కువకు పడిపోయింది.
ఢిల్లీ లోని అతిపెద్ద చికెన్ మార్కెట్ అయిన ఘాజీపూర్ వ్యాపారులు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల ఆర్డర్లు తగ్గాయని చెప్పారు. 10 రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ.200కి ఉందని ఘాజీపూర్ ముర్గా మండిలో దుకాణం నడుపుతున్న మహ్మద్ అనాస్ అన్నారు. అదే సమయంలో జనవరి 3 తర్వాత కిలో రూ.150కి తగ్గిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో తెలంగాణలో చికెన్ ధరలు కొండెక్కాయి. రోజురోజుకు పెరుగుతున్న Chicken ధరలు మాంసం ప్రియులకు షాక్ ఇచ్చాయి. గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. శ్రావణమాసంలో అయిన చికెన్ రేటు తగ్గుతుందని భావించినప్పటికీ.. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో Chicken Price మరింతగా పెరిగింది. శ్రావణమాసంలో కిలో చికెన్ ధర.. రూ. 250గా ఉంది. తాజాగా ఇది మరింతగా పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్ మార్కెట్‌లో రూ.280 నుంచి రూ.300లు పలుకుతుంది.
మాములుగా రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండేది. అయితే ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగినట్టుగా తెలుస్తోంది. కరోనా వ్యాప్తి కాలంలో మాంసాహారం తినాలన్న ప్రచారం సాగడంతో చాలా మంది చికెన్, మటన్‌లు తినడం ఎక్కువ చేశారు. ఈ క్రమంలోనే మంసాహారం వినియోగం పెరిగింది. మరో వైపు కిలో మటన్ ధర కొన్ని చోట్ల రూ. 700 వరకు పలుకుతుంది.
గుడ్డు ధరలు.. చికెన్, మటన్ ధరలే కాకుండా గుడ్డు ధరలు కూడా షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి. సాధారణంగా రూ. 4 విక్రయించే గుడ్డు ధర.. రూ. 6కి పెరిగింది. దీంతో రోజు తమ డైట్‌లో భాగంగా గుడ్లను వినియోగించేవారికి ఇబ్బంది అనే చెప్పాలి.