Coronavirus updates: చాలా నెలల తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రలో ఒకే రోజు కోవిడ్ కొత్త కేసులు 1,000 పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కొత్తగా 575 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఈ ఏడాది ఒకే రోజులో అత్యధికం అని అధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
India reports 11,109 new Covid cases: భారత్ లో మళ్లీ కోవిడ్-19 విజృంభణ మొదలైంది. రోజువారి కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో 11 వేలకు పైగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 50 వేలకు చేరువయ్యాయి. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,109 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల్లో అత్యధికం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు సంఖ్య సైతం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరుకుంది. కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.29 శాతానికి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
undefined
COVID-19 | India reports 11,109 new cases in last 24 hours; the active caseload stands at 49,622
(Representative Image) pic.twitter.com/JBAYX6MaXF
కోవిడ్-19 మరణాలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతూ 29 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ వెలుగుచూసినప్పటిన నుంచి నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,31,064కు చేరుకుంది. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకు మొత్తం 4,42,16,583 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 476 కోవిడ్ డోసుల వ్యాక్సిన్ వేశారు. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 2,20,66,25,120 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు..
చాలా నెలల తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రలో ఒకే రోజు కోవిడ్ కొత్త కేసులు 1,000 పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కొత్తగా 575 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఈ ఏడాది ఒకే రోజులో అత్యధికం అని అధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ కొత్తగా 274 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,59,819 కు చేరుకుంది. మరణాల సంఖ్య 19,752 గా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత 300 మార్కును దాటడం ఇదే తొలిసారి. ఇక దేశరాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, పాజిటివిటీ రేటు 27.77 శాతం ఉంది.