మహారాష్ట్రలో కరోనాతో ఒకరు మృతి, దేశంలో 324 పాజిటివ్ కేసులు

By narsimha lodeFirst Published Mar 22, 2020, 11:19 AM IST
Highlights

కరోనా కారణంగా దేశంలో మరొకరు మృతి చెందారు. ఈ వ్యాధి కారణంగా మహారాష్ట్రలో ఆదివారం నాడు ఓ వ్యక్తి  మృత్యువాత పడ్డారు. 

ముంబై: కరోనా కారణంగా దేశంలో మరొకరు మృతి చెందారు. ఈ వ్యాధి కారణంగా మహారాష్ట్రలో ఆదివారం నాడు ఓ వ్యక్తి  మృత్యువాత పడ్డారు. 

కరోనా వ్యాధి సోకిన 63 ఏళ్ల వ్యక్తి ఆదివారం నాడు ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య ఇండియాలో ఆరుకు చేరుకొంది. రాజస్థాన్ లో ఇటలీకి చెందిన టూరిస్టు కూడ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 

Also read:హైద్రాబాద్ టెక్కీకి కరోనాను ఇలా నయం చేశారు

మహారాష్ట్రలో అత్యధికంగా 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదై ఉన్నాయి. దేశంలో 324 మందికి పాజిటివ్ కేసులు ఉన్నాయి.కరోనా వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛంధంగా జనతా కర్ఫ్యూ ను నిర్వహిస్తున్నారు.  దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

మరో వైపు ఆయా రాష్ట్రాల సరిహద్దులను కూడ మూసివేశారు. దేశంలో నిన్న ఒక్క రోజున సుమారు వంద పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల సరిహద్దులను జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని 24 గంటల పాటు సరిహద్దులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులను నిలిపివేశారు. 

 

click me!