Coronavirus: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై వైద్య నిపుపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే మరోసారి అతిపెద్ద ముప్పును ఎదుర్కొవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు.
Coronavirus: దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా కేసులు నమోదుకావడం కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 17,336 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 30% ఎక్కువ. రోజువారీ కేసుల్లో తాజా పెరుగుదల 124 రోజులలో అత్యధికం కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కరోనా మహమ్మారి కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 4,33,62,294కు పెరిగాయి.
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/sMNqqfv29V pic.twitter.com/yogIBaBbZP
ఇదే సమయంలో కరోనా వైరస్ తో పోరాడాతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నది. కొత్తగా13 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్-19 తో చనిపోయిన వారి సంఖ్య 5,24,954 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో కొత్తగా 4,27,49,056 మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 196.7 కోట్ల కోవిడ్-19 డోసులను పంపిణీ చేశారు. అలాగే, మొత్తం 85,94,93,387 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 6,56,410 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
undefined
➡️India’s cumulative vaccination coverage crosses 196.75 Crore
➡️More than 11 lakh Vaccine doses administered today till 7 pmhttps://t.co/dNJbHWHz33 pic.twitter.com/JlQImAduUK
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న జాబితాలో తెలంగాణ కూడా ఉంది. రాష్ట్రలో కొత్తగా 494 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసులు 7,97,632కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూశాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 315 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 126 మంది ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,90,473గా ఉందని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. ప్రస్తుత కరోనా వైరస్ రికవరీ రేటు 99.10 శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4,111 మంది కరోనాతో మరణించారు.