Harsh firing in wedding: పెళ్లి బ‌రాత్ లో తుపాకీ పేల్చిన వరుడు.. ఊహించని ఘటనతో జైలు పాలు

Published : Jun 24, 2022, 04:22 AM IST
Harsh firing in wedding: పెళ్లి బ‌రాత్ లో తుపాకీ పేల్చిన వరుడు.. ఊహించని ఘటనతో జైలు పాలు

సారాంశం

Harsh firing in wedding: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జ‌రిగిన వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. బ‌రాత్ లో వ‌రుడు ఆనందోత్సాహాలతో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మ‌ర‌ణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Harsh firing in wedding Viral Video: ప్రతి ఒక్కరు త‌మ పెళ్లి వేడుక‌ను చాలా గ్రాండ్ గా జీవితంలో మరచిపోలేని విధంగా జ‌రుపుకోవాల‌ని ప్లాన్స్ వేస్తుంటారు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా స‌రే.. అస‌లూ వెనుకడుగు వేయ్యారు. పెళ్లి ప్రారంభం నుంచి.. ఫోటో షూట్స్.. బ్యాచ్ ల‌ర్ పార్టీలు.. ప్రీవెడ్డింగ్ షూట్స్.. హల్దీ ఫంక్ష‌న్స్, మెహందీ వేడుక‌లు, సంగీత్, పెళ్లి, బ‌రాత్ ఇలా ప్ర‌తి ఒక్క ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఫ్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని సార్లు వేడుకలో అనుకొని సంఘటనలు జరుగుతాయి. అప్పుడప్పుడు.. అనుకోకుండా చేసిన త‌ప్పిదాలే.. విషాద‌క‌రంగా మారుతాయి.  ఇదే కోవ‌కు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ‌ వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన పెళ్లి వేడుక‌లో ఓ అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు తన ప్రాణస్నేహితుడిపై ప్ర‌మాద‌శాత్తు జరిపిన కాల్పులు విషాదాన్ని మిగిల్చాయి. ఈ షాకింగ్ ఘ‌ట‌న సోన్ భద్ర‌ జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

పూర్తి వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) జ‌రిగిన‌ పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. అప్పటి దాక.. పెళ్లికి వ‌చ్చిన బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా వరుడిని ఊరేగిస్తున్నారు. డీజే పాట‌ల‌కు త‌మ‌ను తాము మ‌య‌మ‌రిచి స్టెప్పులు వేస్తున్నారు. పెళ్లి ఊరేగింపులో వ‌ర‌డు ఆనందంగా గాలిలో కాల్పులు జ‌రిపాడు. కానీ, ఆ ఆనందంగా జ‌రిపినా కాల్పులు ప్రాణాంతకం మారాయి. వ‌రుడు జ‌రిపిన‌ కాల్పుల్లో  త‌న ప్రాణా స్నేహితుడు విగ‌త జీవిగా మారాడు. ఈ ఘ‌ట‌న సోమ్ భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో జరిగింది. 

వరుడు మనీష్ మధేషియా అందరూ చూస్తుండ‌గానే.. తుపాకీ తీశాడు. ఆనందంతో అందరికీ చూపిస్తూ..  ఆకాశంలో కాల్పులు జరిపాడు. అయితే.. తుపాకీ అప్పుడు పేలలేదు. దీంతో అతను.. గన్ ను స‌రిచేద్దామ‌ని.. కిందకు తీసుకొని ట్రిగ్గర్ నొక్కాడు. కానీ, ప్ర‌మాద‌శాత్తు ఆ గన్ నుంచి బుల్లెట్ నేరుగా త‌న స్నేహితుడి శ‌రీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాధిత వ్య‌క్తి ఒక్క‌సారిగా కూలిపోయాడు. ఒక్క‌సారిగా  బంధువులు, స్నేహితులంతా  షాక్ కు గురయ్యారు. ఏం జ‌రిగిందో తెలుసుకునే లోపులోనే ఆ వ్య‌క్తిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడని చూసిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడుని ఆర్మీ జవాన్ బాబులాల్ యాదవ్ గా గుర్తించారు. పెళ్లి (Marriage) వేడుకలో పాల్గొనడానికి వచ్చి.. బాబు లాల్ యాదవ్ విగత జీవిగా మారడంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది. మ‌రో ట్వీస్ట్ ఏంటంటే.. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కూడా మృతుడు లాల్ యాదవ్‌కు చెందినది.  
 
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ తర్వాత చర్యలు తీసుకున్న పోలీసులు ..నిందితుడైన వరుడు మనీష్ మధేషియాను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనను ధృవీకరిస్తూ సోనభద్ర పోలీస్ సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, వరుడు, బాధితుడు ప్రాణా స్నేహితులు. ప్ర‌మాద‌శాత్తు జ‌రిగిన కాల్పుల్లో లాల్ యాదవ్‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. వరుడిని అదుపులోకి తీసుకున్నామని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సింగ్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంద‌ని తెలిపారు. పెళ్లి తర్వాత.. కొత్త జీవితం మొదలెట్టాల్సిన వరుడు కాస్త.. అనుకొని ఘటనతో జైలు పాలయ్యాడు.  ప్రస్తుతం వరుడు బరాత్ లో కాల్పులు జరిపిన షాకింగ్ వీడియో నెట్టింట (Social Media)  వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo