అలర్ట్... గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్

By telugu news teamFirst Published Mar 13, 2020, 11:56 AM IST
Highlights

గూగుల్ ఉద్యోగికి కూడా కరోసా సోకినట్లు నిర్థారణ అయ్యింది. బెంగళూరులోని ఓ గూగుల్ ఉద్యోగికి కరోనా సోకినట్లు సదరు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 


భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా భారత్ లో తొలి మరణం నమోదైంది. కర్ణాటకకు  చెందిన ఓ 76ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.  ఈ వార్తతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కాగా.. తాజాగా మరో కరోనా కేసు నమోదైంది.

Also Read భారత్ లో తొలి కరోనా మరణం.. హైదరాబాద్ లో కర్ణాటక వ్యక్తి మృతి...

రెండు రోజుల క్రితం మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు గుర్తించగా.. తాజాగా ఓ గూగుల్ ఉద్యోగికి కూడా కరోసా సోకినట్లు నిర్థారణ అయ్యింది. బెంగళూరులోని ఓ గూగుల్ ఉద్యోగికి కరోనా సోకినట్లు సదరు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కాగా... ఆ ఆఫీసు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఎవరూ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. మళ్లీ సమాచారం ఇచ్చేంత వరకు ఇంటిదగ్గర నుంచే పనిచేయాలని చెప్పారు.

కాగా... ఇప్పటి వరకు భారత్ లో 73మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వారందరికీ ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో  చికిత్స అందిస్తున్నారు. ఈ కరోనా భయంతో చాలా ఐటీ కంపెనీలు.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా ఉద్యోగులకు ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నామని సదరు కంపెనీలు చెబుతున్నాయి. 

click me!