
కోవిడ్ -19 (COVID-19) కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో రెండు వేరియంట్లు ఉంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో డెల్టా వేరియంట్ కేసులు భయటపడుతుంటే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి. దేశంలో రెండో వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు. అయితే ఈ ఒమిక్రాన్ ను దక్షిణాఫ్రికాలో గుర్తించినా.. ఇప్పుడది అన్ని దేశాలకు విస్తరించింది. మన దేశంలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఈ వేరియంట్ ను ఇండియాలో గుర్తించారు. ఇప్పుడవి 1500పైగానే గుర్తించారు. ఇప్పటి డెల్టా వేరియంట్ కేసులు కూడా 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అయితే 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేసులు ఇంత భారీ స్థాయిలో పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అవుతున్నాయి. వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew), నైట్ కర్ఫ్యూ (night curfew) అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కర్నాటక రాష్ట్రం కూడా ఇప్పుడు ఇదే దారిలో వెళ్లనుంది. నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) అమలు చేయనున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నేటి రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
ఈ వీకెండ్ కర్ఫ్యూ లో (weekend curfew)లో భాగంగా థియేటర్లు, మాల్స్, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియంలు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. అయితే ఇందులో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలకు అనుమతి ఉండదు. ఈ కర్ఫ్యూ సందర్భంగా అన్ని ఆఫీసులు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి.
ప్రభుత్వ సచివాలయంలోని సిబ్బంది 50 శాతం సామర్థ్యంతో పని చేయాలి. అది కూడా అండర్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారులతో కొనసాగుతుంది. ఈ వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) సమయంలో ప్రజల అత్యవసర ప్రయోజనాల తీర్చడానికి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల మేరకు బీఎంఆర్ సీఎల్ (BMRCL)తో పాటు ప్రజా రవాణా వ్యవస్థ పని చేస్తుంది.
బెంగళూర్‌లో 2 వారాల పాటు స్కూల్స్ క్లోజ్..
బెంగళూర్‌లో 10, 12వ తరగతులు కాకుండా మిగిలిన్న అన్ని తరగతులను రెండు వారాల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ రూల్స్‌ను ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి మించకుండా, కల్యాణమండలాలు, ఇతర ప్రదేశాల్లో 100 మంది వ్యక్తులతో వివాహ కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతించారు. దేవస్థానాలు తెరిచే ఉంటాయి. అయితే ఇందులో దర్శనం చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సేవ మొదలైన కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి లేదు. ఆలయాల్లోకి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) లో అన్ని ర్యాలీలు, ధర్నాలు, నిరసనలను నిషేదించారు.