PM's Security Breach: అది సిగ్గు చేటు చర్య. ప్రధాని కాన్వాయ్​ అడ్డగింతపై Kangana రనౌత్ ఫైర్

Published : Jan 07, 2022, 05:48 AM IST
PM's Security Breach:  అది సిగ్గు చేటు చర్య. ప్రధాని కాన్వాయ్​ అడ్డగింతపై Kangana రనౌత్ ఫైర్

సారాంశం

Kangana Ranaut: పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ కాన్వ‌య్ ను ఆప‌డంపై న‌టీ కంగనా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వేదిక‌గా పంజాబ్‌లో జరిగింది చాలా సిగ్గుచేటు చ‌ర్య అనీ, ప్రధానమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, భార‌తీయుల ప్రతినిధి, ఆయ‌న‌ 1.4 బిలియన్ల ప్రజల గొంతుక అని, ఆయనపై దాడి జరిగితే ప్రతి భారతీయుడిపై జరిగినట్లేన‌ని పేర్కొంది.   

Kangana Ranaut:  పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీకి భద్రతా వైఫ‌ల్యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ ఆంశంపై కేంద్ర హోం శాఖ‌, మ‌రోవైపు సుప్రీం కోర్టు సీరియ‌స్ అయ్యింది. క్ర‌మంగా ఈ ఘ‌ట‌న‌కు  రాజ‌కీయ రంగు పులుముకుంది. అధికార బీజేపీ పార్టీ సహా ఇత‌ర విపక్షాలు పంజాబ్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు, సీని రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టీ కంగనా రనౌత్ కూడా స్పందించింది. త‌న‌దైన శైలిలో మండిప‌డింది.
  
కంగనా రనౌత్ చాలా సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతలో లోపంపై మండిపడింది. పంజాబ్​లో జరిగిన ఘటన ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన దాడి అని సిగ్గు చేటు చర్య అని ఆమె ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రధాని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన నాయకుడని.. ఆయ‌న 140 కోట్ల మంది భార‌తీయ‌ల  ప్రతినిధి/గొంతుక అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై దాడి ప్రతి భారతీయుడుపై జరిగిన దాడిగా అభివ‌ర్ణించారు.  ఇది ప్రజాస్వామ్యంపై కూడా దాడి అని కంగన మండిపడ్డారు.

ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్​. పంజాబ్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టకపోతే దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉంటే.. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఉన్న‌త సభ్య‌లతో త్రిస‌భ్య  కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్‌ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఛన్నీ ఆదేశించారు . ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మకు చోటు కల్పించింది. 

బుధవారం ప్రధాని మోడీ పంజాబ్ ప‌ర్య‌ట‌న భాగంగాబటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనివాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారక స్థూపానికి బయలుదేరాలి. కానీ,  వాతావరణం సరిగ్గా లేకపోవడంతో 20 నిమిషాలు వేచి ఉన్నారు. ఆ త‌రువాత‌...రోడ్డు మార్గంలో స్మారకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ స్మారకానికి చేరుకోవడానికి 30 కిమీ ముందు పిఎం మోడీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు ఆపారు. 15 నుంచి 20 నిమిషాల పాటు, పిఎం మోడీ ప్లైఓవర్‌పై ఇరుక్కుపోయారు. రహదారి క్లియర్ కాకపోవడంతో అతను తిరిగి అదే మార్గంలో బటిండా విమానాశ్రయానికి వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu