EWS reservation: ఈడబ్ల్యూఎస్ కోటాపై నేడు 'సుప్రీం' కీల‌క తీర్పు

By Rajesh KFirst Published Jan 7, 2022, 7:12 AM IST
Highlights

EWS reservation: నీట్‌ పీజీ అడ్మిషన్లలో  ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారి (ఈడబ్ల్యూఎస్‌) కోటాపై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. గ‌త రెండురోజులుగా ఈ అంశం మీద వాద ప్ర‌తివాద‌న‌లు వింటున్నామ‌ని, ధీర్ఘ‌కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉం దని స్పష్టం చేసింది. పిటిషనర్లు, ప్రతివాదులు తమ ప్రతిపాదనలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. 
 

EWS reservation: నీట్‌ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (EWS ) కోటాకు సంబంధించిన పిటిషన్‌పై సత్వర విచారణ చేపట్టాలంటూ కేంద్రం  చేసిన వినతికి సుప్రీం కోర్టు సమ్మతించింది. ఈ మేర‌కు గ‌త రెండు రోజులుగా  రెండురోజులుగా ఈ అంశం మీద వాద ప్ర‌తివాద‌న‌లు విన్న‌ది. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. వాద, ప్రతివాదులు తమ అభిప్రాయాలను గురువారం సాయంత్రంలోగా కోర్టుకు తెలపవచ్చని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించింది. లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను తెలపాలని పిటిషనర్లను ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. 

 
దేశ‌వ్యాప్తంగా నీట్‌ అడ్మిషన్లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై సుప్రీంకోర్టులో పలు పటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు  తమ అభ్యర్థనలను కోర్టుకు తెలపాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ పిటిష‌న్ల‌పై అఫిడ‌విట్ దాఖాలు చేసిన‌ కేంద్ర‌ప్ర‌భుత్వం..  ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. 

అడ్మిషన్ ప్రాసెస్ జ‌రుగుతున్న‌ప్పుడూ నిబంధ‌న‌ల్ని మార్చడం వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డాల్సి వ‌స్తుందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్ పేర్కోన్నారు. ఈ అంశంపై వ‌చ్చే ఏడాది మార్పులు, స‌వ‌ర‌ణ  చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే.. ఈ అంశంపై  త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తున్నామని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

దేశ‌వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై అనేక సందేహాలు, వంద‌లాది పిటిష‌న్లు రావ‌డంతో సుప్రీంకోర్టు కేంద్రానికి కమిటీ ఏర్పాటు త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్​ భూషణ్​ పాండే, ఐసీఎస్​ఎస్​ఆర్​ మెంబర్​ సెక్రటరీ వీకే మల్హోత్రా, కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్​ సన్యాల్​ స‌భ్యులుగా ఉన్నారు.  గతేడాది నవంబర్​ 30న కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ త‌న నివేదిక‌ను  డిసెంబర్​ 31న సమర్పించింది.

 
కమిటీ నివేదిక ప్రకారం..

* రిజర్వేషన్లు పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షలుగా కొనసాగనుంది.

* ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు.

* ఈ సిఫారసులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియను ప్రభావితం ఉంద‌ని తెలిపింది.   
 

click me!