పోలీసులపై దాడి చేసిన కంటైన్మెంట్ జోన్ వాసులు, ఎందుకంటే...

By Sreeharsha Gopagani  |  First Published Jun 22, 2020, 9:06 AM IST

కంటైన్మెంట్ జోన్లోని ప్రజలు పోలీసులు, వాలంటీర్లపై దాడిచేశారు. ఢిల్లీలోని ఒక కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 


బారికేడ్ల విషయంలో తలెత్తిన గొడవలో...... ఒక కంటైన్మెంట్ జోన్లోని ప్రజలు పోలీసులు, వాలంటీర్లపై దాడిచేశారు. ఢిల్లీలోని ఒక కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఆహరం, ఇతర నిత్యావసరాలను సప్లై చేయడానికి పోలీసులు, వాలంటీర్లు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారితో.... పోలీసులు ఎవరూ బయట తిరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని ఘర్షణకు దిగారు. కొద్దిసేపటికే అది  మారింది. 

Latest Videos

ఆ ప్రాంతంలో గతంలో 10 కేసులయు నమోదవడంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. ఇలా కంటైన్మెంట్ జోన్ గా  పనులకు వెళ్లలేకపోతున్నామని వారు ఘర్షణకు  దిగారు. 

ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారల్ నృత్యం చేస్తుంది. అక్కడి ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కు కరోనా సోకింది. అయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఢిల్లీలో 9మంది పోలీసులు కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. 

ఇకపోతే... రోజు రోజుకీ వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా... చెన్నై నగరంలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీనిని అదుపుచేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.

జూన్ 19వ తేదీ నుంచి దాదాపు 12 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. త‌మిళ‌నాడులోని చెన్నై, చెంగ‌ల్ పేట‌, కంచీపురం, తిరువ‌ళ్లూరులో జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

తమిళ‌నాడు రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 52,334 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కొవిడ్-19తో 625 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన రెండు రోజుల్లోనే 2వేల కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో మహారాష్ర్ట ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో ఉంది.

click me!