20వ కేసులో కూడా దోషిగా తేలిన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్

By Sreeharsha GopaganiFirst Published Jun 22, 2020, 8:21 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ 20వ  కేసులో కూడా దోషిగా తేలాడు. కేరళ కాసర్గోడ్ కు చెందిన మహిళ అత్యాచారం, హత్యా కేసులో తాజాగా మోహన్ దోషిగా తేలాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ 20వ  కేసులో కూడా దోషిగా తేలాడు. కేరళ కాసర్గోడ్ కు చెందిన మహిళ అత్యాచారం, హత్యా కేసులో తాజాగా మోహన్ దోషిగా తేలాడు. ఇప్పటివరకు మోహన్ పై 20 కేసులుండగా ఇదే  చివరి కేసు. 

ఈ కేసుకు సంబంధించిన శిక్షను కోర్టు 24వ తేదీన వెలువరించనుంది. గత 19 కేసుల్లో మోహన్ కి 4 కేసుల్లో మరణశిక్ష విధించారు. 15 కేసుల్లో యావజ్జీవ శిక్ష  విధించారు. కేరళలోని కాసర్గోడ్ కి చెందిన ఒక మహిళ హాస్టల్ లో వంట మనిషిగా పనిచేస్తుండేది. ఆమెతో 2009లో పరిచయం పెంచుకున్నాడు మోహన్. 

ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకు దగ్గరయ్యాడు. అలా ఆమెను లోబర్చుకున్నాడు. ఆ తరువాత మంగళూరు లో వివాహం చేసుకుందామని అన్నాడు. ఆమెను మంగళూరు తీసుకెళ్తున్నానని బెంగళూరు తీసుకెళ్లాడు. యువతీ ఇంట్లోవారికి తాము పెళ్లిచేసుకున్నామని, త్వరలో ఇద్దరం ఇంటికి వస్తామని అన్నారు. 

ఆ రోజు బెంగళూరులోని ఒక లాడ్జిలో రూమ్ తూసుకొని ఆ యువతి పై అత్యాచారం చేసాడు. ఆ తరువాత ఒక వారంరోజులు గర్భ నిరోధక మాత్ర  సైనైడ్ మాత్రని ఇచ్చి  ఆ మాత్ర వేసుకున్నాక  ఆ మహిళ పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లి అక్కడే కుప్పకూలింది. 

అపరిచిత మహిళ మృతిగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి మోహన్ ను అరెస్ట్ చేసారు. ఆ విచారణలో మోహన్ చెప్పిన విస్తుపోయే విషయాలను తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు. ఎందరో మహిళలను లోబర్చుకొని హత్య చేసినట్టు చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. 

click me!