భారత్ లో కరోనా.. 24గంటల్లో పదివేలు దాటిన కేసులు, 396 మరణాలు

By telugu news teamFirst Published Jun 12, 2020, 11:08 AM IST
Highlights

గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే  396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

భారత్ తో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 1,47,195 నయమై కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారిన పడి 8,498 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,97,535కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటు మహారాష్ట్రంలో కోవిడ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 97,648మందికి కరోనా సోకగా… 3,590మంది కరోనాతో మరణించారు. 

తమిళనాడులో 38,716 కరోనా కేసులుండగా… 349 మంది మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీలో 34,687మంది కోవిడ్ బారిన పడగా.. 1,085మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 22,067మందికి కరోనా బారిన పడగా… 1,385 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉండగా... ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. నిన్నటి కేసులతో యూకేని దాటి భారత్ నాలుగో స్థానాన్ని చేరింది. కాగా... కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. భారత్ లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసుల కన్నా రికవరీ రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

click me!