క‌రోనా కేసుల పెరుగుద‌ల.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Published : Apr 05, 2023, 01:34 PM IST
క‌రోనా కేసుల పెరుగుద‌ల.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

సారాంశం

New Delhi: భారతదేశంలో బుధవారం 4,435 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గ‌త‌ 163 రోజుల (ఐదు నెలల 13 రోజులు) లో ఒకే రోజు పెరుగుదలలో అధికం. ప్ర‌స్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 23,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలోనే సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.   

Supreme Court-coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజా ఒక్క‌రోజులోనే నాలుగు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కొత్త కేసులు వెలుగుచూశాయి. భారతదేశంలో బుధవారం 4,435 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గ‌త‌ 163 రోజుల (ఐదు నెలల 13 రోజులు) లో ఒకే రోజు పెరుగుదలలో అధికం. ప్ర‌స్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 23,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలోనే సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కోవిడ్ మ‌ళ్లీ విజృంభిస్తుండటంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ స్పందించారు. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ సీజేఐ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం వ‌ర్చువ‌ల్ విధానంలో న్యాయవాదులు హాజరయ్యేందుకు కోర్టు సుముఖంగా ఉందని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా వాద‌న‌లు వింటామ‌ని తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?