దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 11 వేలకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 3,32,424కి చేరుకొన్నాయి. 1,69,798 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
న్యూఢిల్లీ:దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 11 వేలకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 3,32,424కి చేరుకొన్నాయి. 1,69,798 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 9,520కి చేరుకొన్నాయి. దేశంలో 1,53,106 యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బులెటిన్ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజగా సిక్కింలో కూడ కరోనా కేసు నమోదైనట్టుగా రికార్డులు తెలిపాయి.
undefined
నవంబర్ నాటికి ఇండియాలో కరోనా పీక్: 'వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్ కొరత'
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు హాట్ స్పాట్స్ గా ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనాతో ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని కరోనా మృతుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే 60 శాతంగా ఉన్నాయి.
మహారాష్ట్రలో 3,390 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 1,07,958కి కరోనా కేసులు చేరుకొన్నాయి.మరణాల సంఖ్య 120కి చేరుకొంది.ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 41,182కి చేరుకొన్నాయి. ఈ కరోనాతో ఢిల్లీలో 1,327 మంది మరణించారు.గత 24 గంటల్లో 57,74,133 శాంపిల్స్ పరీక్షిస్తే 11,519 మందికి కరోనా సోకినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.
జార్ఖండ్ రాష్ట్రంలో 1761 కొత్త కేసులు నమోదయ్యాయి. 905 మంది రికవరీ అయ్యారు. అంతేకాదు 9 మంది మరణించారు.24 గంటల్లో ఐటీబీపీకి చెందిన నలుగురు కరోనా బారినపడ్డారు.