ప్రియుడిపై మోజు.. భర్త, కూతురికి భోజనంలో విషం పెట్టి..

Published : Jun 15, 2020, 07:43 AM IST
ప్రియుడిపై మోజు.. భర్త, కూతురికి భోజనంలో విషం పెట్టి..

సారాంశం

ఓ వివాహిత భర్తని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. చివరకు అది వారి కుటుంబాన్నే నాశనం చేసింది. తన ప్రియుడి విషయం తెలిసిందని భర్త, కూతురిని చంపేసింది.

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. ఆ విషయం తెలిసినా కూడా కొందరు ఆ తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. తాజాగా ఓ వివాహిత భర్తని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. చివరకు అది వారి కుటుంబాన్నే నాశనం చేసింది. తన ప్రియుడి విషయం తెలిసిందని భర్త, కూతురిని చంపేసింది. వాళ్లను చంపిన నేరం తనపై పడుతుందనే భయంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో ఓ గ్రామానికి చెందిన వివాహిత(45)కి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ రహస్యంగా చూ కలుసుకునేవారు. అది భర్తకి, కూతురికి తెలిసిపోవడంతో గొడవలు మొదలయ్యాయి. కాగా... ఈ నెల 9 న ఆమె ప్రియుడు మరోసారి ఇంటికి వచ్చి వెళ్లినట్లు భర్తకి తెలియడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తల్లి ప్రవర్తన నచ్చని కూతురు కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఆమె కోపం పెంచుకుంది.

ఆ సంబంధం బయటపడడంతో భర్త, కూతురిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. అదే క్రమంలో... రాత్రి భోజనంలో విషం పెట్టి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా విషం తాగి ప్రాణాలు తీసుకుంది. అదే సమయంలో... దగ్గరలోనే ఉంటున్న ఆమె మామ... వారి ఇంటికి వచ్చిన సమయంలో...  భార్యాభర్తలతో సహా వారి కూతురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే తన చిన్నకొడుకు, బంధువులకు ఫోన్ చేసి ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు విడిచారు. తన కోడలికి మరొకరితో శారీరక సంబంధముందని, ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుతున్నాయని ఆమె మామ తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రియుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu