భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేలు దాటింది. కొత్తగా 103 కోవిడ్ -19 మరణాలు సంభవించాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,970 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది.
గత 24 గంటల్లో తాజాగా 103 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,752కు చేరుకుంది. ఇప్పటి వరకు 30,152 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 53,035 ఉంది.
బీహార్ రాష్ట్రంలో కోరనా వైరస్ కేసులు 1,018కు చేరుకున్నాయి. రాజస్థాన్ లో కొత్తగా 213 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,747కు చేరుకుంది.
లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో శుక్రవారంనాడు 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 547 మంది వాహనదారులకు జరిమానాలు వేశారు.