కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మనదేశంలో రోజు రోజుకూ పెరుగతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 78 వేల మార్కును దాటింది. మరణాలు 2 వేలపైనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 78 వేలు దాటింది. మొత్తం 78003 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా వైరస్ 2,549 మరణాలు సంభవించాయి.
దేశంలో ఇప్పటి వరకు 26235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3,722 కేసులు నమోదు కాగా, 123 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దేశంలో రికవరీ రేటు 33.63 శాతం ఉంది.
undefined
గత నాలుగు రోజుల్లో 10 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని ఘాజీపూర్ కూరగాయల మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసేయనున్నారు. మార్కెట్ కార్యదర్శికి, డిప్యూటీ కార్యదర్శికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మార్కెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు.
కరోనా వైరస్ మాసిపోయేది కాదని, హెచ్ఐవి పాజిటివ్ వంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖైలి జె రియాన్ అన్నారు. హెఐవి రూపుమాసిపోలేదని, అలాగే కరోనా వైరస్ కూడా అంతమయ్యేది కాదని అన్నారు.