ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ట్రక్ ప్రమాదంలో 8 మంది మరణించిన విషయం తెలిసిందే.
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బస్సు ముజఫర్ నగర్ లో వలస కూలీల మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది.
ప్రమాదం ముజఫర్ నగర్ - షాహరాన్ పూర్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. వలస కూలీలు బీహార్ చెందినవాళ్లు. పంజాబ్ లో దినసరి కూలీలుగా పనిచేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారు తమ స్వస్థలాలకు బయలుదేరారు.
Also Read: ఇంటి దారి పట్టి ప్రమాదాల్లో వలస కూలీల మృతి: మృతుల్లో తల్లీకూతుళ్లు
ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. వారిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: హైదరాబాదు నుంచి ఆగ్రాకు, ట్రక్కు బోల్తా: ఐదుగురు వలస కూలీల దుర్మరణం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునాలో ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో 8 మంది కార్మికులు మరణించారు. 50 మందిదాకా గాయపడ్డారు. కాగా, మహారాష్ట్రలో రైల్వే ట్రాక్ పై పడుకున్న వలస కూలీలపై నుంచి రైలు దూసుకెళ్లిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం 16 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు.