దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 50 వేలను దాటింది. కేరళలో తొలికేసు నమోదైన 4 నెలల్లో ఈ కరోనా వైరస్ ఈ స్థాయికి చేరుకుంది.
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 50 వేలను దాటింది. కేరళలో తొలికేసు నమోదైన 4 నెలల్లో ఈ కరోనా వైరస్ ఈ స్థాయికి చేరుకుంది.
చూడడానికి నాలుగు నెలల్లో ఇంత జనాభా ఉన్న భారత్ వంటి పెద్ద దేశంలో ఇది చాలా చిన్న సంఖ్యగా అనిపిస్తున్నప్పటికీ..... 40,000 నుంచి 50,000 కేసులకు చేరుకోవడానికి పట్టిన సమయం తెలుసా...? కేవలం మూడు రోజులు మాత్రమే! ఇంకో భయాందోళనలకు గురి చేసే విషయం ఏమిటంటే... ఈ వైరస్ ఏప్రిల్ 26 వ తేదీ నుంచి నేడు మే 7వ తేదీ నాటికి, అంటే కేవలం 10 రోజుల్లోనే రెట్టింపు అయింది.
ఏప్రిల్ 26 వ తేదీన దాదాపుగా 26 వేల కేసులు నమోదవగా, ఆ సంఖ్య ఇప్పుడు సుమారుగా 53 వేలకు చేరుకుంది. అంటే కేవలం 10 రోజుల వ్యవధిలోనే దీని వ్యాప్తి రెట్టింపయింది!
కేవలం సోమవారం ఒక్కరోజే దాదాపుగా 3,900 కేసులు నమోదయ్యాయంటేనే.... ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 53186 కాగా... 1772 మంది మరణించారు. 14000 మంది పేషెంట్లు ఈ కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు.
16,758 కేసులతో అత్యంత ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిస్తే.... 6,625 కేసులతో గుజరాత్, 5000 పై చిలుకు కేసులతో ఢిల్లీ, దాదాపుగా 4,800 కేసులతో తమిళనాడు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే ఆస్కారముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే... ఈ కరోనా వైరస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37 లక్షలు దాటింది. 12 లక్షల మందికిపైగా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు.
అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా బుధవారం గత 24 గంటల్లో 2,268 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 37,26,666 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 155 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,52,396 మంది మరణించారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 24,713 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,12,835 ఉండగా, గత 24 గంటల్లో 1.324 మంది మరణించారు.
అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 69,921 మంది మృతిచెందారు. ఇక స్పెయిన్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మొత్తం 2,45,567 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు.
మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 25,100 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇటలీలో మొత్తం 2,09,328 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా ఇటలీలో ఇప్పటి వరకు 28,710 మంది చనిపోయారు.