ఒక్కరోజులో 57,937 మంది రికవరీ: ఇండియాలో మొత్తం 27 లక్షలు దాటిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Aug 18, 2020, 10:12 AM IST
Highlights

దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గత 24 గంటల్లో 55,079 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 27,02,743కి చేరుకొంది.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గత 24 గంటల్లో 55,079 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 27,02,743కి చేరుకొంది.

దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 876 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య దేశంలో 51 వేల 797కి చేరినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 6 లక్షల 73 వేల 166 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉంటే ఒక్క రోజులో 57వేల 937  మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు సుమారు 19,77,780 మంది కరోనా నుండి కోలుకొన్నారని కేంద్రం తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు 3,09,41,264 మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఈ నెల 17వ తేదీన 8,99,864 శాంపిల్స్ ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.

దేశంలో కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 72.5 శాతంగా ఉంది. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
 

click me!