భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 49 వేలు దాటింది. 1600కు పైగా కరోనా వైరస్ ప్రభావంతో మరణించారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 49 వేలు దాటింది. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో మొత్తం 49,391 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1694 మంది కరోనా బారిన పడి మరణించారు.
కరోనా వైరస్ నుంచి 14,183 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,514 ఉంది. రికవరీ రేటు 28.71 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
undefined
సగానికిపైగా కేసులు మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని మాలేగావ్ లో గత 24 గంటల్లో కొత్తగా 37 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నాసిక్ జిల్లాలో కొత్తగా 83 కేసులు నమోదయ్యాయి. బీహార్ ప్రభుత్వం హెల్క్ కేర్ వర్కర్స్ సెలవులను రద్దు చేసింది.
ఒడిశాలో ఈ రోజు ఒకరు మరణించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 177కు చేరుకుంది.