ప్రియుడితో సరసాలు.. కళ్లారా చూసిన భర్త..

Published : May 06, 2020, 08:55 AM IST
ప్రియుడితో సరసాలు.. కళ్లారా చూసిన భర్త..

సారాంశం

ఈ క్రమంలో భార్యను కుమార్ పలుమార్లు మందలించాడు కూడా. అయినా ఆమె పట్టించుకోలేదు. కాగా కుందన్ అనే వ్యక్తికి సమత శారీరకంగా దగ్గరైంది.

ఆమెకు సోషల్ మీడియా పిచ్చి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా.. స్మార్ట్ ఫోన్ వదిలిపెట్టదు. కనీసం భర్త ఉన్నాడా, తిన్నాడా అన్న విషయం కూడా పట్టించుకోదు. దీంతో.. చాలా సార్లు భర్త ఆమెను మందలించాడు. అయినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. చివరకు ఓ రోజు భర్తకి అడ్డంగా దొరికేసింది. ఈ సంఘటన కేరళలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ లొని కొట్టాయంలో నివాసముంటోన్న కుమార్(పేరు మార్చాం) భార్య(సమత... పేరు మార్చాం) ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపేది. ఈ క్రమంలో భార్యను కుమార్ పలుమార్లు మందలించాడు కూడా. అయినా ఆమె పట్టించుకోలేదు. కాగా కుందన్ అనే వ్యక్తికి సమత శారీరకంగా దగ్గరైంది. రాత్రి వేళల్లో కుమార్ డ్యూటీకి వెళ్ళగానే నందన్ ఇంటికి వచ్చేవాడు.

ఇదే క్రమంలో... ఓ రోజు ఇద్దరూ కుమార్ కంటబడ్డారు. దీంతో తట్టుకోలేకపోయిన కుమార్... ఇరువురిపై దాడికి యత్నించాడు. దీంతో పెద్ద గొడవ జరగడంతో... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సమత, కుందన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works