ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్: 400 యేండ్ల కిందే చెప్పిన బ్రహ్మం గారు

By telugu teamFirst Published Feb 8, 2020, 10:11 AM IST
Highlights

కరోనా వైరస్ ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.... దీన్ని చాలా కాలం కిందటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం గా బాగా ప్రాచుర్యం పొందిన భవిష్య వాణిలో ఆయన పేర్కొన్నారని ఒక పద్యం చక్కర్లు కొడుతుంది. 

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు కేవలం చైనాలోనే అధికారికంగా 700 మంది మరణించినట్టు తెలుస్తోంది. అనధికారిక లెక్కలప్రకారం అయితే 20వేల మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ పాకుతోంది. 

కరోనా వైరస్ ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.... దీన్ని చాలా కాలం కిందటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం గా బాగా ప్రాచుర్యం పొందిన భవిష్య వాణిలో ఆయన పేర్కొన్నారని ఒక పద్యం చక్కర్లు కొడుతుంది. 

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, 

లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ 

కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి

కోడిలాగా తూగి సచ్చేరయ 

ఈ పద్యం సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతుంది. దాదాపుగా ఒక 4వందల సంవత్సరాల కిందనే బ్రహ్మం గారు జోస్యం చెప్పారని సోషల్ మీడియాలో ఆయన కాలజ్ఞానంపై చర్చ మొదలయింది. 

ఈశాన్యంలో విషగాలి పుట్టి లక్షలాది మంది చనిపోతారని, ఆయన దానికి అప్పట్లోనే కోరంకి అని పేరు పెట్టడం ఇక్కడ మరో ఎత్తు అని సోషల్ మీడియాలో ఈ పద్యం బాగా వైరల్ అయింది. 

పనిలోపనిగా ఆయన గతంలో చెప్పిన కాలజ్ఞానంలో నిజమైన అంశాలను గురించి కూడా చర్చ మొదలుపెట్టారు. ఇందిరా గాంధీ ప్రధాని అవ్వడం నుండి నేపాల్ భూకంపం వరకు అనేక విషయాలను వారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. 

ఇప్పటివరకు ఈ వైరస్ కు మందును ఎవరు కనిపెట్టలేకపోయారు. రోజురోజుకి ఈ వైరస్ పాడగా విప్పుతోంది. వుహాన్ మార్కెట్లో పుట్టినట్టుగా భావిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ తయారీ బృందంలో భారత సంతతికి చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ వాసన్ నాయకత్వం వహిస్తున్నాడు. 

కరోనా వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు డాక్టర్ల బృందం ప్రయత్నాలను చేస్తోంది. కామన్ వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్ఓ)లో ఈ బృందం వ్యాక్సిన్ తయారు చేయనుంది.  

అస్ట్రేలియాకు చెందిన లీడింగ్ సైంటిఫిక్ ఏజెన్సీ. వాసన్ టీమ్ మెల్‌బోర్న్‌లోని డోర్నీ ఇనిస్టిట్యూట్ లో కరోనా వైరస్‌ను డెవలప్ చేశారు. ఈ వైరస్ ను మనిషి షాంపిల్స్ నుండి విజయవంతంగా వేరు చేశారు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ కీలక దశకు చేరుకొన్నట్టుగా సీఐఎస్ఆర్ఓ ప్రకటించింది.

click me!