ఢిల్లీ ఓటర్లకు బంపర్ ఆఫర్.. బస్సు, విమానం అన్నీ ఫ్రీగానే..

By telugu teamFirst Published Feb 8, 2020, 8:54 AM IST
Highlights

అదేవిధంగా ఆటో, బస్సు, విమానయాన సంస్థలు కూడా ఓటర్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లు ప్రకటించాయి. బైక్ టాక్సీ బుకింగ్ యాప్ రాపిడో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేవారి కోసం ఫ్రీ రైడింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.


దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు తరలిస్తున్నారు. కాగా... ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్లను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టింది.

Also Read ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్...

అదేవిధంగా ఆటో, బస్సు, విమానయాన సంస్థలు కూడా ఓటర్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లు ప్రకటించాయి. బైక్ టాక్సీ బుకింగ్ యాప్ రాపిడో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేవారి కోసం ఫ్రీ రైడింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ‘రాపిడో‘ తెలిపింది. ఈ సేవలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఓటర్లకు ఉచిత బస్సు సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది.

ఫిబ్రవరి 5న మొదలైన ఈ క్యాంపెయిన్‌ను ఫిబ్రవరి 10 వరకూ కొనసాగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఎయిర్ లైన్స్ కంపెనీ స్పయిస్ జెట్ కూడా ఈరోజు ఓటర్లకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు స్పయిస్ జెట్‌లో ఢిల్లీ వచ్చేవారు, అదే రోజు తిరిగి వెళ్లేవారికి రెండు టిక్కెట్లపై ఉండే బేస్ టిక్కెట్ ఛార్జీని తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. 

click me!