రేపటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి టీకా: చేతులెత్తేసిన జగన్, ఈటెల

By telugu teamFirst Published Apr 30, 2021, 1:44 PM IST
Highlights

18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి మే 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు లేవు. రేపటి నుంచి ఈ దశ వ్యాక్సినేషన్ ను ప్రారంభించడం సాధ్యం కాదని రెండు ప్రభుత్వాలు కూడా తేల్చి చెప్పాయి.

హైదరాబాద్: రేపటి నుంచి, అంటే మే 1వ తేదీ నుంచి 8 ఏళ్ల వస్సు పైబడినవారికి మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పలు రాష్ట్రాలు రేపటి నుంచి 18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి టీకాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. వ్యాక్సిన్ నిల్వలు లేకపోడంతో పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. 18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి సెప్టెంబర్ నుంచి కరోనా టీకాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అదే సమయంలో రేపటి నుంచి టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 

మహారాష్ట్రలో మొత్తంగానే కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని ఆపేశారు. 18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు అయితే, వారికి స్లాట్లు ఇవ్వడం లేదు. టీకాలు వెంటనే ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్లాట్లను ఇవ్వడం లేదు. రిజిష్టర్ చేసుకున్నవారికి ఎప్పుడు టీకాలు ఇచ్చేది తర్వాత షెడ్యూల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 

పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 45 వయస్సు పైబడినవారికి పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ అందిన సూచనలు కనిపించడం లేదు. తొలి డోసు తీసుకున్నవారికి రెండో డోసు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వ్యాక్సిన్ కొరతతో పలు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ స్థితిలో 18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి టీకాలు ఇవ్వడం ప్రారంభించలేని స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం క్యూలు కట్టవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పారు. వాక్సిన్ల కోసం కంపెనీలను సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి ఇవ్వడానికే సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేదని, 18 ఏళ్లు పైబడినవారికి టీకాలు ఇవ్వడం ఎలా సాద్యమవుతుందని అంటున్నాయి. రేపటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రం కూడా తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ ఉత్పత్తిపై, పంపిణీపై విధానం లేదా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. 

click me!