నడుం కొలత మారుతోందా? కరోనా కాటేస్తుంది.. జాగ్రత్త...

Published : Apr 30, 2021, 01:30 PM IST
నడుం కొలత మారుతోందా? కరోనా కాటేస్తుంది.. జాగ్రత్త...

సారాంశం

కరోనా మహమ్మారి రోజుకో రూపాన్ని మార్చుకుంటోంది. రోజుకో కొత్త లక్షణాన్ని సంతరించుకుంటోంది. అవి తెలుసుకుని వాటికి అలవాటు పడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటిదే తాజాగా ఓ అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు తేలాయి. 

కరోనా మహమ్మారి రోజుకో రూపాన్ని మార్చుకుంటోంది. రోజుకో కొత్త లక్షణాన్ని సంతరించుకుంటోంది. అవి తెలుసుకుని వాటికి అలవాటు పడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటిదే తాజాగా ఓ అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు తేలాయి. 

ఈ సమయంలో కాస్త బరువు పెరగడం వల్ల కూడా కోవిడ్ 19 సోకడానికి ఎక్కువ అవకాశాలున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్నవారిలో ఈ ప్రమాదం అధికంగా ఉందట. 

గురువారం ప్రచురితమైన ఈ పరిశోధనలో.. కోవిడ్ కు  ఎవరు ఎక్కువగా గురవుతున్నారు. ఏ వయసు వారిలో ఎక్కువ సమస్యాత్మకంగా మారుతుంది. అని వివిధ గ్రూపులు, ప్రాంతాల వారిగా అధ్యయనం చేశారు. అంతేకాదు బరువు పెరగడం వల్ల వీరిమీద ఎలాంటి ప్రభావం ఉంటుందని పరిశీలించారు. 

మహారాష్ట్రకు జూలై, ఆగష్టుల్లో కరోనా మూడో వేవ్ భయం: మంత్రి రాజేష్...

వర్క్ ఫ్రం హోం, రెగ్యులర్ గా లాక్ డౌన్ ఉంటుండడం, కరోనా వల్ల పెరిగిపోయిన ఒత్తిడితో ప్రపంచవ్యాప్తంగా కాస్త లావు అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఊబకాయం దీనికి కిందికి రాదు. 

బాడీమాస్ ఇండెక్స్ 23 కంటే ఎక్కువ ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని యు.కె పరిశోధకులు తెలిపారు. BMI లో ప్రతీ పాయింట్ పెరుగుదల మీరు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 5%, ఇంటెన్సివ్ కేర్ లో చేరే ప్రమాదాన్ని 10% పెంచుతుందని వారు కనిపెట్టారు.

ఇక బరువు పెరగడం వల్ల కలిగే ఈ దుష్ప్రభావం 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా ఉంది, అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే నల్లజాతీయులకు ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉందట. ఇంగ్లాండ్‌లోని దాదాపు 7 మిలియన్ల మంది హెల్త్ రికార్డులను అధ్యయనం చేసిన తరువాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.

అయితే 80యేళ్లు దాటిన వారిలో అధిక బరువు పెద్దగా ప్రభావితం చేయడం లేదని తేలింది. ఈ పరిశోధన ది లాన్సెట్ డయాబెటిస్ & ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్