ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

By telugu news teamFirst Published Jun 19, 2020, 12:14 PM IST
Highlights

క‌రోనా సోకిందేమో అన్న భ‌యంతో కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండగా…. క‌రోనా పాజిటివ్ అని తేలిన వ్య‌క్తులు త‌మ నుంచి వైర‌స్ కుటుంబ స‌భ్యుల‌కు సోకుతుందేమో అన్న భ‌యంతో త‌నువు చాలిస్తున్నారు.
 

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ఈ కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. కాగా... ఈ కరోనా వైరస్ సోకిందనే భయంతోనే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వైరస్ చాలా మందిని మానసికంగా వేధిస్తోంది. 

క‌రోనా సోకిందేమో అన్న భ‌యంతో కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండగా…. క‌రోనా పాజిటివ్ అని తేలిన వ్య‌క్తులు త‌మ నుంచి వైర‌స్ కుటుంబ స‌భ్యుల‌కు సోకుతుందేమో అన్న భ‌యంతో త‌నువు చాలిస్తున్నారు.

తాజాగా హ‌ర్యానాలో ఇటువంటి విషాద‌మే చోటుచేసుకుంది. క‌రోనా పాజిటివ్ అని తేలిన‌ ఓ 55 ఏళ్ల‌ వ్య‌క్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆస్ప‌త్రిలో తాను ట్రీట్మెంట్ పొందుతున్న వార్డులోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఘ‌టనాస్థలిని ప‌రిశీలించిన‌ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ప‌ది అడుగుల భౌతిక దూరం పాటిస్తూ.. అత‌ని అంత్య‌క్రియ‌ల్లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. గురువారం వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 12,237కు చేరింది. గురువారం హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,60,384గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న‌వారు 1,94,325 మంది ఉన్నారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్ర‌భుత్వాల‌ను క‌ల‌వ‌రపెడుతోంది.

click me!