కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 3016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు ఈ కేసుల సంఖ్య 2,151గా నమోదు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు ఢిల్లీ ఆరోగ్య శాఖ అత్యవసరంగా సమావేశం కానుంది.
దేశంలో కరోనా కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. కొంత కాలం వరకు తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 2 వేలకు పైగా కేసు నమోదు కాగా.. తాగాజా గురువారం ఆ సంఖ్య 3 వేలకు పెరిగింది. ఒకే రోజు వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ కూడా గురువారం అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది.
మెట్రో స్టేషన్ వద్ద నమాజ్.. ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు..
undefined
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 3016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ రేటు 2.73 శాతంగా ఉంది. ఇదే సమయంలో 15,784 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,10,522 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 92.14 కోట్లకు చేరింది.
గడిచిన 24 గంటల్లో 1,396 మంది వైరస్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 4,41,68,321కి చేరింది. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు (95.20 కోట్ల సెకండ్ డోస్, 22.86 కోట్ల ముందు జాగ్రత్త మోతాదు) ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య రోజుకు 0.03 శాతం చొప్పున 13,509 ఉండగా, రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉంది.
రాహుల్ గాంధీపై యూకే కోర్టులో కేసు వేస్తానని లిత్ మోదీ హెచ్చరిక.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..
ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 300 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు కూడా సంభవించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, స్పెషలిస్టు వైద్యులు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాహువుగా మారారు - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
కాగా.. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కోసం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు, దానిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసేందుకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి నిర్వహించారు.