మెట్రో స్టేషన్‌ వద్ద నమాజ్.. ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు..

Published : Mar 30, 2023, 12:01 PM IST
మెట్రో స్టేషన్‌ వద్ద నమాజ్.. ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు..

సారాంశం

బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు ఎంఐఎం నాయకురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఆమె నమాజ్ చేశారు.

బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు ఎంఐఎం నాయకురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని హుస్సేన్‌గంజ్‌లోని మెట్రో స్టేషన్‌ వద్ద ప్రార్థనలు చేసినందుకు ఎంఐఎం నాయకురాలు ఉజ్మా పర్వీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో స్టేషన్‌లో నమాజ్ వద్ద నమాజ్ చేసిన ఫొటోను ఉజ్మా పర్వీన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ప్రార్థనలు చేసే స్థలాన్ని విధాన్‌ భవన్‌గా ఉజ్మా తప్పుగా చూపించారని.. ఇది తప్పుదోవ పట్టించేలా సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ అపర్ణ రజత్‌ కౌశిక్‌ తెలిపారు. 

మెట్రో స్టేషన్‌ వద్ద ఆమె(ఉజ్మా)  ప్రార్థనలు చేశారని కౌశిక్ తెలిపారు. ఆ తర్వాత ‘‘ఎవరైనా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉన్నందున ఎక్కడైనా ప్రార్థనలు చేయవచ్చు’’ అని ట్వీట్ చేశారని  తెలిపారు. ఉజ్మాపై ఐపీసీ 153 ఏ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), ఐపీసీ 200 (తప్పుడు సమాచారం ఇవ్వడం), ఐపీసీ 283 (ప్రజామార్గానికి ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

 

ఇక, గత సంవత్సరం అంతర్జాతీయ చైన్ అవుట్‌లెట్‌కు చెందిన ఒక ప్రముఖ మాల్‌లో  ఎనిమిది మంది వ్యక్తులు నమాజ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం వారందరినీ అరెస్టు చేశారు. అయితే ఈ మాల్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..