కూచ్ బెహార్ కాల్పులు : అమిత్ షా రాజీనామాకు దీదీ డిమాండ్..

By AN TeluguFirst Published Apr 10, 2021, 5:07 PM IST
Highlights

కూచ్ బెహార్ లో కాల్పుల ఘటనపై ఈసీ వివరణ ఇవ్వాలని, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మమత డిమాండ్ చేశారు.  పశ్చిమ బెంగాల్ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూచ్ బెహార్ లో కాల్పుల ఘటనపై ఈసీ వివరణ ఇవ్వాలని, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మమత డిమాండ్ చేశారు.  పశ్చిమ బెంగాల్ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూచ్ బెహార్లోని శీతల్ కూచ్ లో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జరిగిన ప్రాణ నష్టంపై ఆమె స్పందించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర 24 పరగణాస్ లోని బదౌరియా ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచార ర్యాలీ అనంతరం బీహార్లోని కాల్పుల ఘటన స్థలానికి వెళ్లనున్నట్లు చెప్పారు.

ఓటు వేసేందుకు క్యూలైన్లలో వేచి ఉన్న వారిపై కేంద్ర భద్రతా బలగాలు కాల్పులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులను సూచించారు. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హింగల్ గంజ్ లో మాట్లాడిన మమత కేంద్ర బలగాలు కాల్పులు జరపడంపై ధ్వజమెత్తారు.

 ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీకి తెలుసునని అందుకే ప్రజల్ని చంపేందుకు కుట్ర చేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలంతా శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఈ ఎన్నికల్లో వారిని ఓడించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. 

మూడేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించారు ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచీ దాదాపు 15 నుంచి 18 మంది హత్యకు గురయ్యారన్నారు. వీరిలో కనీసం పన్నెండు మంది కేవలం తమ పార్టీ వారిని దీదీ చెప్పారు. ఈ ఘటనపై ఈసీ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

‘భద్రతా బలగాలపై కేంద్రహోంశాఖ ప్రభావం ఉందని మేము ముందునుంచి చెప్తున్నాం... మా భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. ఆ బలగాల చేతిలో ఐదుగురు మరణించారు. ఎందుకు అన్ని మరణాలు సంభవించాయి. హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. ఇంత మందిని చంపిన తర్వాత కూడా ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపినట్లు వారు చెప్పడం సిగ్గుచేటు.. అదంతా అబద్ధం’ అని ఎన్నికల ప్రచారంలో మమత విరుచుకుపడ్డారు. ఓటమిని ముందుగానే గుర్తించిన భాజపా ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు.

click me!