గుడ్ న్యూస్ : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు...

Published : May 15, 2021, 10:25 AM IST
గుడ్ న్యూస్ : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు...

సారాంశం

దేశ వ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది. మరోసారి రికవరీ కేసులు యాక్టీవ్ కేసుల సంఖ్యను దాటి ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 18 కోట్లు దాటింది.  

దేశ వ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది. మరోసారి రికవరీ కేసులు యాక్టీవ్ కేసుల సంఖ్యను దాటి ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 18 కోట్లు దాటింది.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,26,098 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ తో 3,890 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 3,53,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,43,72,907 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 36,73,802 మందికి చికిత్స కొనసాగుతుంది.

కరోనా నుండి ఇప్పటి వరకు 2,04,32,898 మంది బాధితులు కోలుకున్నారు. కాగా కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 2,66,207 మంది మృతి చెందారు. ఇలా చూసుకుంటే దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.83%, కాగా మరణాల రేటు 1.09%గా ఉంది. ఇప్పటివరకు 18,04,57,579 మందికి కరోనా టీకాలు తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !