దేశంలో కొత్తగా 1,249 కరోనా కేసులు.. 8 వేలకు చేరువైన యాక్టివ్ కేసులు

Published : Mar 24, 2023, 12:49 PM IST
దేశంలో కొత్తగా 1,249 కరోనా కేసులు.. 8 వేలకు చేరువైన యాక్టివ్ కేసులు

సారాంశం

దేశంలో కరోనా కేసులు మరోసారి వేయి సంఖ్యను దాటాయి. తాజాగా 1,249 కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు కర్ణాకట, గుజరాత్‌లలో ఒక్కోటి చొప్పన చోటుచేసుకున్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,927కు పెరిగాయి.  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేయికిపైగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, కొత్తగా 1,249 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,927కు పెరిగాయి. కర్ణాటక, గుజరాత్‌లలో ఒక్కో మరణం చోటుచేసుకుంది. కొత్తగా రెండు మరణాలు చేరడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,818కు పెరిగింది. 

డైలీ పాజిటివిటీ 1.19 శాతంగా రికార్డ్ అయింది. వీక్లీ పాజిటివిటీ 1.14 శాతానికి పెరిగింది. కాగా, మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,00,667)కు చేరాయి. మొత్తం కేసుల్లో ఇప్పటి యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయి. కాగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read: రూ.కోటి ఫైన్లు వసూల్ చేసిన రైల్వే అధికారిణి..!

గడిచిన 24 గంటల్లో 1,05,316 టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 92.07 కోట్ల టెస్టులు నిర్వహించారు. 220.65 కోట్ల కరోనా టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు