ఇండియాలో కరోనాతో రికార్డు స్థాయిలో మరణాలు: ఒక్క రోజులోనే 1501 మంది మృతి, డేంజర్ బెల్స్

By narsimha lodeFirst Published Apr 18, 2021, 10:41 AM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపుతోంది. గత 24 గంటల వ్యవధిలో 2,61, 500 కేసులు నమోదయ్యాయి.  ఒక్క రోజులోనే కరోనాతో 1501 మంది మరణించారు.
 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపుతోంది. గత 24 గంటల వ్యవధిలో 2,61, 500 కేసులు నమోదయ్యాయి.  ఒక్క రోజులోనే కరోనాతో 1501 మంది మరణించారు.గత 24 గంటల వ్యవధిలో 15.66 లక్షల మందికి  కరోనా టెస్టులు చేశారు. వీరిలో 2,61,500 మందికి కరోనా సోకింది.  దేశంలో మొత్తం కేసులు 1,47,88,109కి చేరుకొన్నాయి.  గత 24 గంటల్లో  1,38,423 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  కరోనా నుండి  కోలుకొన్న వారి సంఖ్య 1,28,09,643 కి చేరుకొంది.

also read:వారణాసిలో కరోనాపై నేడు మోడీ సమీక్ష...

కరోనాతో ఒకే రోజున 1501 మరణాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,77,150కి చేరుకొంది. దేశంలో మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూనే  ఉంది.  మహారాష్ట్రలో 67,123 కేసులు నమోదయ్యాయి.  మహారాష్ట్ర,ఛత్తీస్‌ఘడ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి  ప్రధాని మోడీ శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. గత ఏడాదిలో కరోనాను ఎలా ఓడించామో ఈ దఫషా కూడ అలానే కరోనాను ఓడిస్తామని అధికారులతో సమీక్ష సమావేశంలో మోడీ అభిప్రాయపడ్డారు.

click me!