రాజస్థాన్ బీజేపీ నేతపై బహిష్కరణ వేటు.. గురుద్వారాలపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే....

Published : Nov 06, 2023, 08:03 AM IST
రాజస్థాన్ బీజేపీ నేతపై బహిష్కరణ వేటు.. గురుద్వారాలపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే....

సారాంశం

తాను "మసీదులు, మదర్సాలు" అని చెప్పాలనుకున్నానని.. కానీ.. మాటలు తడబడి.. పొరపాటున "మసీదులు, గురుద్వారాలు" అన్నానని సమర్థించుకున్నారు.   

గురుద్వారాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ కు చెందిన  బీజేపీ నాయకుడిని ఆ పార్టీ బహిష్కరించింది. ఆయన వ్యాఖ్యలు రాజస్థాన్ పొరుగున ఉన్న పంజాబ్‌లోని చాలా మంది పార్టీ నేతలను కలవరపరిచింది. ఆయనను బహిష్కరించాలని బీజేపీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు పిలుపునిచ్చారు.

పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రకటన చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు సందీప్ దయామాను పార్టీ నుంచి బహిష్కరించారని రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ తెలిపారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్ని మసీదులు, గురుద్వారాలు ఉన్నాయో చూడండి.. ఇవి భవిష్యత్తులో ‘‘పుండ్లు"గా మారతాయని, వాటిని నిర్మూలించాలని అన్నారు. 

భూపేష్ బాఘేల్ నన్ను దుబాయ్ వెళ్లమని సలహా ఇచ్చాడు.. శుభమ్ సోనీ వీడియో వైరల్..

ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దయామా తన వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పాడు. తాను  "మసీదులు, మదర్సాలు" అని చెప్పాలనుకున్నానని.. అయితే పొరపాటున "మసీదులు, గురుద్వారాలు" అన్నానని చెప్పుకొచ్చాడు. ఆయన వివరణతో పంజాబ్ నేతలు శాంతించలేదు. పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్, సునీల్ జాఖర్, రాజస్థాన్ నాయకుడు చేసిన ఈ ఆగ్రహ వ్యాఖ్యలను క్షమించలేమని చెప్పగా, అమరీందర్ సింగ్ సందీప్ దయామాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

పంజాబ్ బీజేపీ మహిళా విభాగం చీఫ్ జై ఇందర్ కౌర్ దయామాపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దయామా ప్రకటనపై పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు జాఖర్ తెలిపారు. "తోటి పౌరుల మతపరమైన మనోభావాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ నాయకుడు విరుచుకుపడడాన్ని క్షమించలేం. అతని ఖండించదగిన ప్రకటన వల్ల ప్రజలకు కలిగే బాధను నేను కేంద్ర నాయకత్వానికి వివరించాను" అని ఆయన అన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !