అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం 50 శాతం పూర్త‌య్యింది - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

By team teluguFirst Published Oct 8, 2022, 3:21 PM IST
Highlights

2024 మకర సంక్రాంత్రి రోజున అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆలయ నిర్మాణంలో ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం 50 శాతానికి పైగా పూర్తి అయ్యింద‌ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జైపూర్‌లోని శ్రీ పంచఖండ్ పీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయ ట్రస్ట్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం 2024 సంవ‌త్స‌రం మ‌క‌ర సంక్రాంతి రోజున ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే అవకాశం ఉంద‌ని అన్నారు. 2020లో ఈ ఆల‌య నిర్మాణం ప్రారంభమైంద‌ని, 2024 చివరి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నార‌ని చెప్పారు. 

“శ్రీకృష్ణ భగవానుడు ప్రతిపాదించిన ‘కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన’ (మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి కానీ ఫలాలను ఆశించకండి) అనే తత్వాన్ని నేను నమ్ముతాను. 1949లో రామ మందిర నిర్మాణం కోసం ఒక ఉద్య‌మం ప్రారంభ‌మైంది. దాని కోసం అనేక మంది అంకితభావంతో కృషి చేశారు. ఇప్పుడు ఈ ప్రయత్నాల కారణంగా ఆలయానికి సంబంధించిన 50 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. ’’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

అవన్నీ అవాస్త‌వలే.. అస‌లు త‌గ్గేదేలే.. నామినేషన్ ఉపసంహరణ పుకార్లపై శశి థరూర్ ఘాటు స్పంద‌న

ఈ సందర్భంగా ఇటీవల మరణించిన శ్రీ పంచఖండ్ పీఠం మాజీ అధిపతి ఆచార్య ధర్మేంద్రకు యోగి నివాళి అర్పించారు. అనంతరం సామాజిక, మతపరమైన ఉద్యమాలలో ఆ పీఠం ప్రాముఖ్య‌త‌ను ఆయ‌న నొక్కి చెప్పారు. రామజన్మభూమి వద్ద దేవాలయం కావాలని ఆచార్యజీ ఎప్పుడూ కలలు కనేవారని అన్నారు. “మహాత్మా రామచంద్ర వీర్ మహరాజ్, స్వామి ఆచార్య ధర్మేంద్ర మహారాజ్ దేశానికి నిస్వార్థంగా సేవ‌లు అందించారు. దేశ సంక్షేమం కోసం సాధువులు నిర్వహించే వివిధ ప్రచారాలలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో పీఠం  కీలక పాత్ర పోషించింది. ’’ అని ఆయన అన్నారు.

జాతీయ భాషగా హిందీ అంశంపై రాహుల్ గాంధీ స్పందన.. ఏమన్నాడంటే?

ఆచార్య ధర్మేంద్ర భౌతికంగా లేనప్పటికీ ఆయ‌న విలువలు, ఆదర్శాలు, సహకారం అంద‌రిలో స‌జీవంగా ఉంటాయ‌ని అన్నారు. ఆచార్య త‌న ఆలోచనలను బహిరంగంగా, తార్కికంగా కమ్యూనికేట్ చేయడం వల్ల హిందూ సమాజం ఆయనను గౌరవించిందని యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ ప‌నులు 2020 ఆగస్టు 5న ప్రారంభ‌మ‌య్యాయి. ఆరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసి ప‌నులను మొద‌లు పెట్టారు. రామమందిర కార్యకలాపాలకు ఇన్‌ఛార్జ్ అయిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. నిర్మాణ కమిటీకి మాజీ ఐఏఎస్ నృపేంద్ర మిశ్రా చైర్మన్‌గా ఉన్నారు.

ఆలయం మరియు ప్రాకారాల నిర్మాణానికి లార్సెన్ అండ్ టూబ్రో ప్రధాన కాంట్రాక్టర్ కాగా,  టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లను  ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా నియమించారు, మరో నలుగురు ఇంజనీర్లు నలుగురు ఇంజనీర్లు జగదీష్ అఫాలే (ఐఐటీ- ముంబై), గిరీష్ సహస్త్రభుజని (ఐఐటీ-ముంబై) ), జగన్నాథ్ (ఔరంగాబాద్), అవినాష్ సంగమ్నేర్కర్ (నాగ్ పూర్ )కూడా ట్రస్ట్ తరపున స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.

పాకిస్తాన్ వరదలు.. 1,700కు చేరిన మృతుల సంఖ్య.. 12,000 మందికి పైగా గాయాలు

మొత్తం ప్రాజెక్ట్ నిర్మించడానికి 900 నుండి 1,000 కోట్ల మధ్య వ్యయం అవుతుందని అంచనా వేశారు. 110 ఎకరాల స్థలంలో ఈ ఆల‌యం విస్తరించి ఉంటుంది. ఆలయ సముదాయంలో మ్యూజియం, పరిశోధనా కేంద్రం, ఆర్కైవల్ కేంద్రం కూడా ఉంటాయి. డిసెంబరు 2023 నాటికి, గర్భగుడి, రామ్ లల్లా విగ్రహం ఉండే ఆలయం దిగువ అంతస్తు పూజకు సిద్ధంగా ఉంటుంది.

click me!