పాల కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి గోసను అర్థం చేసుకున్న సదరు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు కదలడం ప్రారంభించింది. దీన్ని గమనించిన ఆ సదరు కానిస్టేబుల్ ఒక చేత్తో తన తుపాకిని పట్టుకొని మరొక చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని ప్లాట్ ఫారం వెంట పరుగుతీసి ఆ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆ తల్లికి... ఆ బిడ్డకు పట్టడానికి పాలప్యాకెట్ అందించాడు.
ప్రభుత్వం నడుపుతున్న శ్రామిక్ రైలు కర్ణాటకలోని బెళగావి నుండి గోరఖ్ పూర్ బయల్దేరింది. ఆ రైల్లో పాల కోసం అలమటిస్తున్న చంటిపాప, ఆ పాపను చూసి నిస్సహాయంగా గోస పడుతున్న చంటిపిల్ల తల్లి కూడా ఉన్నారు.
ఉదయం రైలు ఎక్కినప్పటినుండి ఆ చంటి పాప పాల కోసం ఏడుస్తూనే ఉంది. కానీ ఆ తల్లికి ఎక్కడా పాలు దొరకడం లేదు. ఇంతలోనే రైలు భోపాల్ స్టేషన్ కి చేరుకుంటుండగా అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను పాపకు పాలు కావాలి అని అడిగింది ఆ తల్లి.
పాల కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి గోసను అర్థం చేసుకున్న సదరు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు కదలడం ప్రారంభించింది. దీన్ని గమనించిన ఆ సదరు కానిస్టేబుల్ ఒక చేత్తో తన తుపాకిని పట్టుకొని మరొక చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని ప్లాట్ ఫారం వెంట పరుగుతీసి ఆ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆ తల్లికి... ఆ బిడ్డకు పట్టడానికి పాలప్యాకెట్ అందించాడు.
ఇదంతా సీసీటీవీ లో రికార్డు అయింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ కానిస్టేబుల్ ధైర్య సాహసాలను చూసి, అతని సేవాతత్పరతకు మెచ్చి అతడి వీడియోను ట్వీట్ చేస్తూ అభినందనలను తెలపడమే కాకుండా అతడికి నగదు పురస్కారాన్ని కూడా అందించాడు.
Commendable Deed by Rail Parivar: RPF Constable Inder Singh Yadav demonstrated an exemplary sense of duty when he ran behind a train to deliver milk for a 4-year-old child.
Expressing pride, I have announced a cash award to honour the Good Samaritan. pic.twitter.com/qtR3qitnfG
వివరాల్లోకి వెళితే, అతడి పేరు ఇందర్ సింగ్. భోపాల్ స్టేషన్ లో రైల్వే పోలీసుగా పనిచేస్తున్నాడు. ఆ పాలు అడిగిన మహిళ పేరు షరీఫ్ హష్మీ, భర్త హసీన్ హష్మీతో కలిసి గోరఖ్ పూర్ కి వెళ్తోంది.
ఉదయం బెళగావి నుంచి రైల్లో బయల్దేరిన ఆ తల్లి పిల్లకు పాల కోసం వెదుకుతూనే ఉంది. కానీ ఎక్కడా పాలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రైలు భోపాల్ స్టేషన్ లోకి రాగానే అక్కడ కానిస్టేబుల్ ని పాలు తెచ్చివ్వమని కోరింది.
అతడు స్టేషన్ నుంచి బయటకు వెళ్లి పాలప్యాకెట్ తీసుకొని వచ్చి, పాలప్యాకెట్ ఇద్దామనుకునే సరికి రైలు కదిలింది. అతడు ఆ రైలు వెంట పరుగెత్తాడు. ఆ సమయంలో ఒక చేత్తో తన సర్వీస్ రైఫిల్ ను పట్టుకొని మరోచేత్తో పాల ప్యాకెట్ తో ఆ ఆ రైలు వెంట ఉరుకుతూ ఆ తల్లికి పాల ప్యాకెట్ ని అందించాడు.