మే 3 తర్వాత దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఏంటి?

By telugu news teamFirst Published Apr 30, 2020, 11:27 AM IST
Highlights

తాజాగా ఈ లాక్ డౌన్ పై కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మరో నెలరోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి. అయితే.. గ్రీన్ జోన్ లలో మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకే దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ అమలులో ఉన్నా.. దేశంలో 33వేల మందికి కరోనా సోకింది. వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలోనే రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు.

ఈ నేపథ్యంలో.. మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా.. సడలిస్తారా లేదా.. ఇంతటితో ముగిస్తారా అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీనిపైనే అందరి ఆసక్తి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే.. తాజాగా ఈ లాక్ డౌన్ పై కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మరో నెలరోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి. అయితే.. గ్రీన్ జోన్ లలో మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇక్కడ స్కూల్స్, పబ్లిక్ రవాణా, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ లు, బార్లు ఓపెన్ చేసే అవకాశం లేదు. ఇక షాపింగ్ మాల్స్ ని కూడా ఓపెన్ చేసే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటిలో కూడా జనాలు అందరూ ఒక చోటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కామర్స్ సర్వీసుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి ఉండే అవకాశం ఉంది.

వర్క్ ఫ్రం ని ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే . ఆటోలు అనుమతించినా సరే గ్రీన్ జోన్ కి మాత్రమే పరిమితం చేయడమే కాకుండా ఆటోలో ఎక్కువ మందిని అనుమతించవద్దు అని రైలు సర్వీసుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. రైలు సర్వీసులను విమాన సర్వీసులను దాదాపుగా అనుమతించే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది.

click me!