కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఓ వ్యక్తి తన తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి లేదు. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఓ వ్యక్తి తన తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు.
సరుకుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను.. వివాహం చేసుకొని పెళ్లికూతురితో కలిసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో గత రెండు నెలలుగా ఇంటి నుంచి కాలు బయటపెట్టని అతని తల్లి.. వాళ్లిద్దరి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లింది. తన కుమారుడి ఆలోచనల్ని ముందగానే పసిగట్టలేకపోయానని ఆ తల్లి వాపోయింది.
undefined
వీరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరికి వివాహానికి సంబంధించి ఎటువంటి రుజువులు లేవని పోలీసులు తెలిపారు. వీరి వివాహం జరిపించిన పూజారి కూడా పెళ్లిని ధృవీకరించాలంటే.. అది లాక్‌డౌన్ తర్వాతేనని స్పష్టం చేశారు. అయితే అప్పటివరకూ ఆ పెళ్లికూతురిని తన ఇంట్లోకి అనుమతించనని వరుడి తల్లి తెలిపింది. కానీ, పోలీసుల వారికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపిచినట్లు సమాచారం.
వారు ముగ్గురూ పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియోను జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. తల్లి ఇంట్లోకి సరుకులు తెమ్మని పంపిస్తే.. కొడుకు వంట మనిషిని తీసుకొచ్చాడని ఓ నెటిజన్ ఛలోక్తి విసరగా.. నేను రేపు సరుకులు కొనడానికి వెళ్తానంటూ మరొకరు ట్వీట్ చేయగా... ఏ షాపులో పెళ్లి కూతుళ్లను విక్రయిస్తున్నారంటూ మరొకరు కొంటెగా స్పందించారు. ఇలాంటి పనులు యూపీ కుర్రాళ్లు మాత్రమే చేయగలరని మరొకరు రిప్లయ్ ఇచ్చారు.