ప్రజలతో సంబంధాలు తెగాయి, జనంలోకి వెళ్లాలి: కాంగ్రెస్ చింతన్ శిబిరంలో రాహుల్ గాంధీ

By narsimha lodeFirst Published May 15, 2022, 3:53 PM IST
Highlights

తాను జీవితంలో తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శిబిరంలో రాహుల్ గాంధీ కీలక ఉపన్యాసం చేశారు.

ఉదయ్‌పూర్: జీవితంలో తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో ఆదివారం నాడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi ప్రసంగించారు. 

Congress కు ఉన్న చరిత్ర దేశంలో మరో పార్టీకి లేదన్నారు .  కాంగ్రెస్ లో సరికొత్త మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి శిబిరాలను ఏ పార్టీ నిర్వహించడం లేదన్నారు.ఎంతోమంది  సీనియర్లతో సమావేశం నిర్వహించాలనుకున్నామన్నారు. BJP  పాలనలో అభిప్రాయాలు చెప్పడం  కూడా నేరంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు బీజేపీలో Dalitకు స్థానం లేకుండా పోయిందన్నారు. దళితులు, గిరజనులు అణచివేతకు గురౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని రీజినల్ పార్టీలు దళితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు అణచివేతకు గురయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు.పద్దతి ప్రకారం వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు,తాను ఎవరికీ భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు..నేతలంతా ప్రజల వద్దకు వెళ్లాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు.

also read:Rahul Gandhi: కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రాహుల్ గాంధీ పాద‌యాత్ర !

మనమంతా కలిసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై పోరాడి ఓడించి చూపిద్దామని ఆయన పార్టీ నేతలను కోరారు. సీనియర్లు కొందరు అప్పుడప్పుడూ డిఫ్రెషన్ లోకి వెళ్లారన్నారు.బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోందన్నారు. మనం చేసే పోరాటం దేశ భవిష్యత్తు కోసమేనని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్ లో మెరుగ్గా ఉందన్నారు. వారి వద్ద డుబ్బు కూడా ఉందన్నారు. మనం కూడా కమ్యూనికేషన్ ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని  బలోపేతం చేయాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబందాలు తెగిపోయాయన్నారు.  ప్రజల్లోకి వెళ్లడం ద్వారా  ప్రజలతో సంబంధాలను  పునరుద్దరించుకోవాలని ఆయన కోరారు.దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. మీతో కలిసి పోరాటం చేసేందుకు తాను కూడా సిద్దంగా ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పారు.

సంస్థాగత రాజకీయ ఆర్ధిక వ్యవసాయ సామాజిక న్యాయం యువతకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సుదీర్థ చర్చలు తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆరు కమిటీలు నివేదికలను అందించాయి.

click me!