సోనియా, రాహుల్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం: ఏఐసీసీ కార్యాలయం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు

Siva Kodati |  
Published : Mar 13, 2022, 06:50 PM IST
సోనియా, రాహుల్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం: ఏఐసీసీ కార్యాలయం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు

సారాంశం

సోనియా , రాహుల్ గాంధీలు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. మరోవైపు సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్‌గా జరుగుతోంది.   

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం (AICC Office , Delhi) వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు (congress) ఆదివారం ఆందోళనకు దిగారు. సోనియా, రాహుల్ రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సోనియా  (sonia gandhi) , రాహుల్ (raghul gandhi) పార్టీ బాధ్యతలు చూసుకోవాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు. సోనియా, రాహుల్ రాజీనామా  చేస్తారంటూ వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నేత డీకే శివకుమార్ (dk shiva kumar) కోరుతున్నారు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు అక్బర్ రోడ్డును బ్లాక్ చేశారు. ఈ రోడ్ వద్దకు గాంధీ కుటుంబ మద్దతు దారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రాజీనామాలు చేయవద్దంటూ యూత్ కాంగ్రెస్ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఇకపోతే.. సీడబ్ల్యూసీ సమావేశం హాట్ హాట్‌గా జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. పార్టీలో పూర్తి స్థాయిలో  ప్రక్షాళన జరగాలని, జీ 23 అసమ్మతి నేతలు ఇప్పటికే హైకమాండ్‌ను డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను అధ్యక్షుడిగా నియమించాలని అసమ్మతి నేతలు సూచించినట్లు సమాచారం. 

గాంధీయేతర వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వస్తే.. ప్రస్తుతం ముకుల్ వాస్నిక్‌కే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్‌కే బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అలాగే జీ 23 నేతల డిమాండ్లు, పార్టీ సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా లేక ప్రస్తుత పరిస్ధితుల్లో బాధ్యతల నుంచి దూరంగా వుండకుండా రాహుల్‌కే పార్టీ పటిష్టత బాధ్యతలు ఇస్తారా అనేది ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

కాగా.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత  అసమ్మతి నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 2021 అక్టోబర్ మాసంలో CWC  సమావేశమైంది. సీడబ్ల్యుసీలో  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు.  ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway