Women Reservation Bill: కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం, కానీ...: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్

Published : Sep 18, 2023, 11:16 PM IST
Women Reservation Bill: కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం, కానీ...: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్

సారాంశం

Women Reservation Bill: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయినా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. 

Women Reservation Bill: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయినా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి నూతన పార్లమెంట్ భవనం లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజే సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్నారని సమాచారం.

సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. సుమారు రెండు గంటలకు పాటు సాగిన ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశం లభిస్తుంది.

కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము . బిల్లు వివరాల కోసం ఎదురు చూస్తున్నాము. ప్రత్యేక సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చిస్తే.. గోప్యత రాజకీయాలకు బదులు ఏకాభిప్రాయం లభించేదని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇలా పేర్కొంది. “మహిళలు ముందుకు రావాలని, దేశ రాజకీయాల్లో మహిళలు పాల్గొనాలని రాజీవ్ గాంధీ కోరుకున్నారు. మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. పంచాయతీ రాజ్‌లో 30% మహిళా రిజర్వేషన్లు దీనికి బలమైన ఉదాహరణ. అని రాసుకొచ్చారు.  ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. ఇది మొత్తం 543 మందిలో 15 శాతం కంటే తక్కువ. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లు ఆమోదం కల్పిస్తోంది.  
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..