బీహార్ లోని నలందలో ఇద్దరూ పోలీసులు మార్గమధ్యంలో పరస్పరం ఘర్షణ పడ్డారు. డయల్ 112లో పని చేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అనంతరం లాఠీలతో తీవ్రంగా కొట్టుకున్నారు. మార్గమధ్యంలో వీరిద్దరూ గొడవపడుతుండడాన్ని చూసిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
బీహార్ లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం నితీశ్‌కుమార్ సొంత జిల్లా నలందలో డబ్బుల లావాదేవీల విషయంలో ఇద్దరు పోలీసులు ఘర్షణకు దిగారు. దాదాపు అరగంట పాటు జరిగిన వాగ్వాదం రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పోలీసులు ఒకరినొకరు తన్నడం, కొట్టుకోవడం, తీవ్రంగా కొట్టుకోవడం వంటివి వీడియో లో చూడవచ్చు.
ఆ ఇద్దరు పోలీసులు డయల్ 112లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ గొడవ సోమవారం రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలోని మార్గమధ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం, కిక్‌లు, పంచ్‌లతో కొట్టుకోవడం కనిపిస్తుంది. స్థానికులు, అక్కడి ప్రజలు ఎలా చెప్పినా వారు మాత్రం వినిపించుకోలేదు.
కొంత సమయం తరువాత.. ఒక పోలీసు డయల్-112 వాహనం నుండి లాఠీని తీసుకుని వచ్చి, దానితో అవతలి వ్యక్తిని కొట్టడం ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవను రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. పోట్లాడుకోవద్దు, మీరు సస్పెండ్ అవుతారని ప్రజలు పోలీసులకు ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన సొహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ రైల్వే హాల్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఆ ఇద్దరి పోలీసులను ప్రదీప్ కుమార్ యాదవ్, వికాస్ గోస్వామిగా గుర్తించారు. ఇద్దరూ రాహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని డయల్ 112 టీమ్‌లో సేవలందిస్తున్నారు.
డబ్బుల కోసమేనా..
వీడియోలో.. ఒక పోలీసు, మరొక పోలీసు డబ్బు తీసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. గొడవకు కారణం స్పష్టంగా తెలియరాలేదు. కానీ, లంచం విషయంలోనే వారిద్దరి మధ్య వివాదం ఏర్పడినట్లు స్థానికులు అంటున్నారు. అక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు పోలీసులను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ వారు అంగీకరించలేదు. పోలీసుల మధ్య వాగ్వాదం జరగడం చూసి బాటసారులు గుమిగూడారు. అలా చేయొద్దు.. ఇద్దరినీ సస్పెండ్ చేస్తామంటూ ఘటనా స్థలంలో ఉన్నవారు చెబుతున్నారు.
Bihar Police personnel are fighting over bribe money!
Jungle Raaz in Nitish's Bihar. pic.twitter.com/3weqr1FLPr
ఎస్పీ ఏం చెప్పారు?
ఈ కేసులో ఇద్దరు పోలీసులను గుర్తిస్తున్నట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. మార్గమధ్యలో తమ మధ్య గొడవలు జరగడం వల్ల పోలీసుల పరువు పోయింది. ఇద్దరి పోలీసులను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డయల్ 112లో పనిచేస్తున్న సిబ్బంది నలంద పోలీస్ ఫోర్స్‌కు చెందినవారు.