ప్రధాని మోదీ మాదిరి ఆహ్వానం లేని అతిథిగా పాకిస్తాన్‌కు వెళ్లలేదుగా..?: రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై కాంగ్రెస్

Published : May 03, 2022, 04:01 PM IST
ప్రధాని మోదీ మాదిరి ఆహ్వానం లేని అతిథిగా పాకిస్తాన్‌కు వెళ్లలేదుగా..?: రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై కాంగ్రెస్

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియోను షేర్ చేసిన బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అయితే బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్‌ కూడా గట్టిగానే తిప్పికొడుతుంది. రాహుల్ పార్టీకి హాజరయ్యాడని.. అందులో ఎక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియోను షేర్ చేసిన బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శల దాడిని ప్రారంభించారు. అయితే మోదీ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడంతో.. రాహుల్ గాంధీ వీడియోతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ. రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేస్తూ..  కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి నైట్ క్లబ్‌ల వెంట తిరగమేమిటని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ సొంత పార్టీని నడపటం కంటే.. పార్టీలలో బిజీగా ఉన్నాడని బీజేపీ నేత, బిహార్ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. ఇలా బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్‌ కూడా గట్టిగానే తిప్పికొడుతుంది.రాహుల్ పార్టీకి హాజరయ్యాడని.. అందులో ఎక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అందులో తప్పుపట్టాల్సిన అంశం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ .. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ పార్టీలో పాల్గొన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘ఇతనెవరూ..?’’ అని ప్రశ్నించారు. 

ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు భారత్‌కు మిత్రదేశమైన నేపాల్‌కు రాహుల్ గాంధీ వెళ్లాడని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది నేరం కాదని పేర్కొంది. 2015లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా హాజరుకావడంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషమని బీజేపీకి కౌంటర్ ఇచ్చింది. 

 

రాహుల్ గాంధీ.. నవాజ్ షరీఫ్‌తో కేక్ కట్ చేయడానికి ప్రధాని మోదీలా ఆహ్వానం లేని అతిథిగా పాకిస్తాన్‌కు వెళ్లలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై మండిపడ్డారు. పఠాన్ కోట్‌లో ఏం జరిగిందో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్ గాంధీ ఒక జర్నలిస్టు వివాహానికి హాజరయ్యేందుకు మిత్రదేశమైన నేపాల్‌కు వెళ్లారు. అందులో తప్పేమీ లేదు. ఇది మన సంస్కృతికి సంబంధించినది. ఇది నేరం కాదు. బహుశా ప్రధానమంత్రి, బీజేపీ త్వరలో.. స్నేహితులు, కుటుంబ సభ్యుల వివాహాల్లో పాల్గొనడం నేరమని నిర్ణయించవచ్చు’’ అంటూ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. 

ఇక, బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధఈ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యాడని.. అందులో తప్పేముందని ప్రశ్నించాురు. ఆయన గురించి సంఘీలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సంఘీలు అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. మనందరం కూడా ప్రైవేటు ఫంక్షన్లకు హాజరవుతామని పేర్కొన్నారు. 


ఇక, రాహుల్ గాంధీ సోమవారం విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఖట్మాండ్‌కు వెళ్లారు. ఆయనతో మరో ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. నేపాల్‌కు చెందిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఖాట్మండ్‌కు వెళ్లారు. ఆమె గతంలో సీఎన్‌ఎన్ వార్త సంస్థలో కరస్పాండెంట్ పనిచేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్.. మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు. అంతకుముందు.. 2018 ఆగస్టులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్‌కు వెళ్లే మార్గంలో రాహుల్ గాంధీ ఖాట్మండును సందర్శించారు. ఇక, సుమ్మిమా ఉదాస్ పెళ్లి మంగళవారం జరగనుందని.. గురువారం రిసెప్షన్ ఉంటుందిన ఖాట్మండ్ పోస్టు వార్తాపత్రికి పేర్కొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?