పంజాబ్‌లో మోడీ పర్యటన రద్దు.. ప్రధాని రూట్ మ్యాప్ లీక్ వెనుక ఎవరు: స్మృతీ ఇరానీ ఆరోపణలు

Siva Kodati |  
Published : Jan 05, 2022, 05:39 PM ISTUpdated : Jan 05, 2022, 05:42 PM IST
పంజాబ్‌లో మోడీ పర్యటన రద్దు.. ప్రధాని రూట్ మ్యాప్ లీక్ వెనుక ఎవరు: స్మృతీ ఇరానీ ఆరోపణలు

సారాంశం

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను ఎవరు లీక్ చేశారని స్మృతీ ఇరానీ ప్రశ్నించారు. ప్రధానికి హాని చేయాలని చూసినవారికి శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని రూట్ బయటకు ఎలా తెలిసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ దగ్గరకు ఎలా వెళ్లగలిగారని ఆమె ప్రశ్నించారు.

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (smriti irani) మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఎద్దేవా చేశారు. ప్రధానికి హాని చేయాలనే స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను ఎవరు లీక్ చేశారని స్మృతీ ఇరానీ ప్రశ్నించారు. ప్రధానికి హాని చేయాలని చూసినవారికి శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని రూట్ బయటకు ఎలా తెలిసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ దగ్గరకు ఎలా వెళ్లగలిగారని ఆమె ప్రశ్నించారు. ప్రధాని రూట్ మ్యాప్ సమాచారం సాధారణ ప్రజలకు తెలియదని స్మృతీ ఇరానీ అన్నారు. 

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) పంజాబ్‌లో (punjab) నిరసన సెగ ఎదురైన వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భటిండా ఎయిర్‌పోర్ట్‌లో (bhatinda airport) పంజాబ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కృతజ్ఞతలు చెప్పానని చెప్పండంటూ అధికారులకు తెలిపారు. తాను భటిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో చేరుకోగలిగానని ప్రధాని అన్నారు. 

Also Read:నేను ప్రాణాలతో బయటపడ్డా.. పంజాబ్‌ సీఎంకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి: అధికారులతో మోడీ

కాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే, తన షెడ్యూల్ చేసిన పర్యటనను ప్రధాన భద్రతా లోపం కారణంగా రద్దు చేసుకున్నారు.  హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నట్లు కనుగొనబడింది. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ప్రధాని భద్రతలో ఇది అతిపెద్ద లోపం అని చెప్పాలి.  

భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయినట్టు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునేటప్పటికి కొందరు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించినట్టు గుర్తించారు. ప్రధాని ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఇది కీలకమైన లోపం''అని హోం మంత్రిత్వ శాఖ త‌న ప్రకటనలో పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu