కాంగ్రెస్ మేనిఫెస్టోకు వేళాయే.. ఏయే హామీలు ఉన్నాయంటే..?  

By Rajesh Karampoori  |  First Published Apr 5, 2024, 12:13 AM IST

Congress Manifesto: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో నేడు(శుక్రవారం) విడుదల చేయనున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేయనుంది. మరుసటి రోజు రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాలివేనా? 


Congress Manifesto: రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శుక్రవారం (నేడు) విడుదల చేయనున్నది.  ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో-విజన్ డాక్యుమెంట్‌ను కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ మేనిఫెస్టోను ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్’ పేరుతో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
 

ఆ మరునాడు(శనివారం) పార్టీ అగ్ర నేతలు జైపూర్, హైదరాబాద్‌లలో మెగా ర్యాలీలలో ప్రసంగించనున్నారు. జై‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు   బహిరంగ సభలో పాల్గొని మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. ఇక హైదరాబాద్‌‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ భారీ ర్యాలీలో మేనిఫెస్టోను విడుదల చేసి,  ప్రసంగించనున్నారు.  

Latest Videos

undefined

మేనిఫెస్టోలో ఉన్న అంశాలివేనా? 


కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అందులో సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇవ్వనుంది. 

>> సామాజిక సమాజాల్లో కులగణన రిజర్వేషన్ల పరిమితిని తీసివేయడం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై హామీలు ఇవ్వనుంది, 

>> ఇక రైతు న్యాయంలో పంటకు కనీస మద్దతు ధర, రైతుల రుణమాఫీకి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. అలాగే వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులను జీఎస్టీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని సమాచారం.

>> అటు కార్మిక న్యాయం పేరుతో మరో హామీ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఆరోగ్యం, హక్కులు, అసంఘటిత కార్మికులకు జీవిత ప్రమాద బీమా కల్పిస్తామని భావిస్తోంది. 

>> మరోవైపు యువ న్యాయం పేరుతో మరో కీలకమైన హామీని రూపొందించింది. ఇందులో పేపర్ లీక్ లను పూర్తిగా నిరోధించే విధానం అమల్లోకి తెస్తామని, అలాగే.. రిక్రూట్మెంట్ ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి,  30 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇవ్వనుంది.
 
>> కర్ణాటక తెలంగాణలో అత్యధికంగా ప్రభావం చూపిన పథకాలను మహిళా న్యాయం పేరుతో మ్యానుఫెస్టోలో పొందుపరచండి. నిరుపేద కుటుంబాలలోని మహిళలకు లక్ష రూపాయల సాయం, కేంద్ర ప్రభుత్వంలో కొత్త రిక్రూట్మెంట్స్ లో 50 శాతం మహిళ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వనున్నది. 

click me!