Farmers Protest : స్వామినాథన్ కమీషన్ సిపార్సును తిరస్కరించిందే కాంగ్రెస్... ఆధారమిదిగో..!

By Arun Kumar P  |  First Published Feb 14, 2024, 1:46 PM IST

దేశ రాజధాని డిల్లీలో రైతులు ఆందోళనకు దిగడంతో మరోసారి స్వామినాథన్ కమీషన్ సిపార్సులు తెరపైకి వచ్చాయి. పంటలకు కనీస మద్దతుధరకు చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 


న్యూడిల్లీ : రైతుల ఆందోళనలతో దేశ రాజధాని డిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇప్పటికే డిల్లీ సరిహద్దులకు చేరుకున్న పంజాబ్, హర్యానా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. వేలాదిమంది రైతులు డిల్లీ శివారుకు చేరుకోవడంతో వారిని అదుపుచేయడం పోలీసుకుల కూడా కష్టతరంగా మారంది. పోలీస్ బారీకేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటుచేసి రైతులను అడ్డుకుంటున్నారు. 

మరోసారి అన్నదాతలు చేపట్టిన ఈ ఆందోళనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటల కనీస మద్దతు ధరకు న్యాయబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా పంటకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకువస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 

Latest Videos

undefined

అయితే గతంలో యూపీఏ ప్రభుత్వమే స్వామినాథన్ కమీషన్ సిపార్సులను తిరస్కరించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీన్ని అమలుచేస్తామని హామీ ఇస్తోంది. ఎన్నికల కోసమే రైతులను మభ్యపెట్టి రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది.  

స్వామినాథన్ కమీషన్ ను తిరస్కరించినట్లు స్వయంగా యూపిఏ హయాంలో ఆనాటి కేంద్ర మంత్రి కేవి.థామస్ ప్రకటించారు. ఆనాటి బిజెపి ఎంపీ ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో స్వామినాథన్ కమీషన్ సిపార్సులను ఆమోదించారా? లేదా? అని ప్రశ్నించారు. అందుకు థామస్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. 

ఎంఎస్ స్వామినాథన్ కమీషన్ కనీస మద్దతు ధర  అనేది ఆ పంట కనీస పెట్టుబడి కంటే 50శాతం అధికంగా వుండాలని సూచించినట్లు థామస్ తెలిపారు. కానీ పలు కారణాలతో ఈ సిపార్సును ఆమోదించలేదని ఆనాటి కేంద్రమంత్రి థామస్ సమాధానం ఇచ్చారు. తాజాగా రైతు ఆందోళనకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 

click me!